25 సవర్ల బంగారు ఆభరణాలు అపహరణ
రేపల్లె రూరల్: ఇంట్లో ఎవరూ లేని సమయంలో బంగారం అపహరణకు గురైన సంఘటన పట్టణంలోని 23వ వార్డులో చోటుచేసుకుంది. సీఐ మల్లికార్జునరావు వివరాల మేరకు.. అల్లపర్తి లావణ్య, ఆమె భర్త వాసులు ఈ నెల 2వ తేదీన బాపట్ల వెళ్లారు. వారి ఇరువురు పిల్లలు హైదరాబాద్ వెళ్లారు. బుధవారం ఆమె ఇంటికి తిరిగి రాగా అప్పటికే ఇంటి తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోని బీరువా తెరచి ఉంది. బీరువాలోని 25 సవర్ల బంగారు ఆభరణాలు కనిపించలేదు. బాధితురాలు లావణ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ చెప్పారు. సంఘటనా స్థలాన్ని వేలిముద్రల బృందం పరిశీలించింది.
Comments
Please login to add a commentAdd a comment