నేడు సుబ్రమణ్యేశ్వర స్వామి కల్యాణం
కర్లపాలెం: శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యేశ్వరస్వామి శాంతి కల్యాణం శుక్రవారం ఉదయం కనుల పండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గురువారం తెలిపారు. పెదపులుగు వారిపాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీవల్లి, దేవసేన సమేత సుబ్రమణ్యస్వామి ఆలయం వద్ద గురువారం విశేష పూజలు చేసి శాంతిహోమం నిర్వహించారు. శాంతిహోమం పూజా కార్యక్రమాల్లో కొందరు దంపతులతోపాటు గ్రామంలోని భక్తులు పాల్గొని పూజలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. శుక్రవారం శాంతి కల్యాణం అనంతరం భక్తులకు బాపట్ల అఖండ ఫౌండేషన్, గ్రామపెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment