దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం | - | Sakshi
Sakshi News home page

దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం

Published Fri, Jan 17 2025 1:48 AM | Last Updated on Fri, Jan 17 2025 1:48 AM

దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం

దళితులపై కూటమి ప్రభుత్వానికి ద్వేషం

ఫిరంగిపురం: కూటమి ప్రభుత్వానికి దళితులంటే ద్వేషం అని అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ అన్నారు. మండలంలోని పొనుగుపాడు గ్రామం ఎస్సీకాలనీలోని బాధిత దళితులను గురువారం ఆయన పరామర్శించారు. చర్చిగోడకు సంబంధించి కూల్చివేసిన ఘటన గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయ బలంతో పోలీసులను అడ్డుపెట్టుకొని దళితులను నిర్బంధించి గోడ కూలగొట్టి రోడ్డు వేశారన్నారు. ఇది దారుణమైన సంఘటన అని పేర్కొన్నారు. గ్రామంలో ఎప్పుడో బ్రిటీష్‌ వారి కాలంలో దళితులకు చర్చి కోసం స్థలం కేటాయించారని చెప్పారు. ఇక్కడి గోడను కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కోర్టు కేసులను కూడా పట్టించుకోకుండా కూల్చివేశారని చెప్పారు. గతంలో కూడా ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం దేవరపల్లిలో ఈ తరహా సంఘటన జరిగిందన్నారు. వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో దళితులకు ఉన్నతస్థానం కల్పించారని తెలిపారు. నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత దళితులపై ప్రభుత్వానికి ఎందుకింత ద్వేషం అని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పచ్చ మీడియా కనీసం నోరు కూడా మెదపని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులపై కక్షపూరితంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గ్రామంలో కూడా పేదదళితులు చర్చికి ఒకవైపు గోడ నిర్మించుకున్నారని, మరోవైపు డబ్బు లేక నిర్మించుకోలేదని చెప్పారు. అధికారబలంతో ఎంపీ, ఎమ్మెల్యే, ఎస్పీ, కలెక్టర్‌, అధికారులు కలిసి గోడను పడగొట్టించడం దారుణమన్నారు. దళిత ఎమ్మెల్యే అయి ఉండి కూడా ఇంత జరుగుతున్నా కనీసం నోరు విప్పకపోవడం సరికాదన్నారు. పేద ప్రజలు నమ్ముకున్న చర్చికి సంబంధించిన గోడను పునర్మించాలన్నారు. ప్రభుత్వం ఇచ్చిన స్థలాన్ని మరలా వారికి కేటాయించాలని డిమాండు చేశారు. సమావేశంలో స్థానిక నాయకులు గేరా కోటేశ్వరరావు, సేవా నాగరాజు, మేళం జోజిబాబులు పాల్గొన్నారు.

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌ పొనుగుపాడులో దళితులకు పరామర్శ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement