20 నుంచి భూముల రీ సర్వే
ఆర్డీఓ గ్లోరియా
కోమలి(కర్లపాలెం): ఈనెల 20వ తేదీ నుంచి భూముల రీ సర్వే కార్యక్రమం జరుగుతుందని బాపట్ల ఆర్డీవో గ్లోరియా తెలిపారు. పిట్టలవానిపాలెం మండలం కోమలి గ్రామంలో గురువారం భూముల రీ సర్వేపై రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డీవో గ్లోరియా మాట్లాడుతూ రైతులకు సంబంధించిన పట్టా భూముల సర్వే నిర్వహిస్తామని తెలిపారు. కోమలి గ్రామంలో ఉన్న 1198 ఎకరాలను నాలుగు బ్లాకులుగా విభజించి సర్వే చేయనున్నట్లు చెప్పారు. సర్వే పనులకు సంబంధించిన నోటీసులు రైతులకు సర్వ్ చేయటం జరుగుతుందన్నారు. సర్వే కార్యక్రమానికి రైతులందరూ సహకరించి తమ భూములకు సంబంధించిన సమస్యలను పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్యామల నాగిరెడ్డి, తహసీల్దార్ మెహర్‌కుమార్, ఆర్‌ఐ కె.శ్రీనివాసరావు, సర్వేయర్ ఆదినారాయణ, వీఆర్వోలు, విలేజ్ సర్వేయర్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment