తల్లిదండ్రులు గర్వపడేలా ఎదగాలి
చేబ్రోలు: తల్లిదండ్రులు గర్వపడేలా విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని గుంటూరులోని టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు అన్నారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో రెండు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి విజ్ఞాన్ బాల మహోత్సవ్ శనివారం ఘనంగా ముగిసింది. ఈ కార్యక్రమానికి హాజరైన అద్దంకి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో విద్యార్థులు విభిన్న ఆలోచనలు, క్రియేటివిటీతో ముందుకు దూసుకుపోవాలని తెలిపారు. బాల్యం నుంచే విభిన్నంగా ఆలోచించే అలవాటును పెంచుకోవాలని సూచించారు. జీవితంలో ఏమి సాధించాలనుకుంటున్నారో దాన్ని పొందే వరకు కృషి చేయాలని చెప్పా రు. విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులందరూ చక్కగా చదువుకుని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఎమోషనల్‌గాను, మెంటల్‌గాను దృఢంగా ఉండాలని సూచించారు. ఓటములను తట్టుకునే మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకుని సంపూర్ణమైన వ్యక్తిత్వం సాధించాలని తెలిపారు. మారుతున్న జీవనశైలిలో ప్రతి విద్యార్థీ ఆరోగ్యంగా ఉండాలంటే ఏదో ఒక క్రీడలో మక్కువ చూపించాలని చెప్పారు.
వేలాదిగా పాల్గొన్న విద్యార్థులు
రాష్ట్ర స్థాయి విజ్ఞాన్ బాల మహోత్సవ్‌లో మొత్తం 50 ఈవెంట్లను నిర్వహించారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు విలువైన నగదు బహుమతులతో పాటు ట్రోఫీలను అందించారు. బాల మహోత్సవ్‌లో పాల్గొనేందుకు రాష్ట్రంలోని వివిధ స్కూల్స్ నుంచి ఐదు వేల మందికి పైగా విద్యార్థులు ఆయా క్రీడాంశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, డీన్లు, అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టొబాకో బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అద్దంకి శ్రీధర్‌బాబు విజ్ఞాన్‌లో వైభవంగా ముగిసిన బాల మహోత్సవ్
Comments
Please login to add a commentAdd a comment