కానిస్టేబుళ్లకు అర్హత సాధించిన 14 మంది హోంగార్డులు
నగరంపాలెం: స్థానిక పోలీస్ కవాతు మైదానంలో శనివారం పలు జిల్లాల్లో పని చేస్తున్న హోంగార్డులకు కానిస్టేబుళ్ల దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ మైదానానికి చేరుకుని పర్యవేక్షించారు. 40 మంది హాజరవ్వగా, ఏడుగురు ధ్రువపత్రాలు తీసుకురాలేదు. ముగ్గురికి శరీర కొలతలు సరిపోకపోవడంతో తిరస్కరించారు. మిగతా 30 మందికి 1600 మీటర్ల పరుగు పందెం పోటీలు నిర్వహించగా, 14 మంది ఉత్తీర్ణత సాధించా రు. నలభై మందికి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించగా 11 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లా ఏఎస్పీలు రమణమూర్తి (పరిపాలన), హనుమంతు (ఏఆర్), ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలురెడ్డి, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
మార్చి 3 నుంచి ఇంటర్ దూరవిద్య పరీక్షలు
నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం (దూర విద్య) ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖాధికారి ఎల్.చంద్రకళ, ప్రభుత్వ పరీక్షల జిల్లా కోఆర్డినేటర్ కె.ఎం.ఎ.హుస్సేన్‌లు శనివారం తెలిపారు. ఈ మేరకు దూరవిద్య రాష్ట్ర డైరెక్టర్ ఆర్.నరసింహారావు ఉత్తర్వులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్‌లో 2024–25 విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పొందిన వారు పరీక్షలు రాసేందుకు అర్హులని తెలిపారు. పల్నాడు జిల్లా పరిధిలో 9 కేంద్రాలలో 2,387 మందిపరీక్షలకు హాజరు కానున్నట్టు వివరించారు. చిలకలూరి పేటలోని శారదా హైస్కూల్‌లో 302 మంది, నరసరావుపేటలోని మున్సిపల్ బాలికోన్నత పాఠశాల, బాలుర పాఠశాల, కాసు బ్రహ్మానందరెడ్డి పాఠశాల, శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్ కలిపి నాలుగు కేంద్రాలలో 1,094 మంది, సత్తెనపల్లిలోని జెడ్పీ హైస్కూల్ (బాలికలు), జెడ్పీ హైస్కూల్ (సుగాలీ కాలనీ) కలిపి రెండు కేంద్రాలలో 526 మంది, గురజాలలోని గుడ్‌న్యూస్ హైస్కూల్‌లో 205 మంది, వినుకొండ లయోలా హైస్కూల్‌లో 260 మంది పరీక్షలకు హాజరు కానున్నారని వివరించారు. పరీక్షలు ఆయా తేదీలలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని తెలిపారు. మార్చి 3 వ తేదీన ఇంగ్లిష్, 5న హిందీ, తెలుగు, ఉర్దూ, 7న రసాయన శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, సామాజిక శాస్త్రం, 10న భౌతికశాస్త్రం, రాజనీతి / పౌర శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం, 12న గణితం, చరిత్ర, వ్యాపార గణక శాస్త్రం, 15న జీవ శాస్త్రం, వాణిజ్య/వ్యాపార శాస్త్రం, గృహ విజ్ఞాన శాస్త్రం పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment