ఫ్లోర్‌బాల్ అండర్–17 జిల్లా జట్ల ఎంపిక
నరసరావుపేట ఈస్ట్: ఫ్లోర్‌బాల్ అండర్–17 బాల బాలికల జిల్లా జట్ల ఎంపిక పోటీలను గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి పాఠశాలలో శనివారం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల నుంచి 70 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 8, 9వ తేదీలలో చిలకలూరిపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తారని పాఠశాల ప్రిన్సిపల్ జి.బర్నబాస్, ఫ్లోర్‌బాల్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లవరపు కిషోర్ తెలిపారు. బాలుర విభాగంలో జి.జస్వంత్, కె.రక్షణ్ ఆనంద్, ఎస్.వీరవెంకటవరుణ్, ఎస్.శశాంక్, జె.రోహిత్, ఎల్.మణికంఠరెడ్డి, బి.వెంకటగౌతమ్, ఎం.నాగభానుప్రసాద్, ఎం.జగత్, ఎం.షణ్ముఖ్‌సాయి, కె.హర్షిత్, యు.హేమచంద్ర, జె.హర్షిత్, ఎం.హేమంత్, బి.మణిదీప్, కె.సాయిచరణ్‌లు ఎంపికయ్యారు. అండర్–17 బాలికల జట్టుకు ఎం.హృదయరెడ్డి, జి.వైష్ణవి, ఎం.దీప్తిప్రియాంక, ఎన్.అశ్విత, షేక్.మహసిన్, నిరీక్షణ, ఎన్.హంసిని, ఎ.హర్షిణి, జి.రమతేజ, జి.హాసినిలు ఎంపికయ్యారు. ఎంపికై న విద్యార్థులను పాఠశాల ఛైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, క్యాంపస్ ఇన్‌చార్జ్ కోట బాపూజీ, అకడమిక్ కో ఆర్డినేటర్ పుట్ట హేమంత్‌లు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment