తాడేపల్లిలో గంజాయి కలకలం
యువకుడు, ఇద్దరు మహిళలు అరెస్ట్
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మరోసారి గంజాయి విక్రయాలు బయటపడ్డాయి. పోలీసులు శనివారం చాకచక్యంగా వ్యవహరించి గంజాయి విక్రయిస్తున్న యువకుడు సహా కొనుగోలు చేస్తున్న ఇద్దరు పాత మహిళా నేరస్తులను అరెస్టు చేశారు. విలేకరుల సమావేశంలో గుంటూరు జిల్లా క్రైమ్ అడిషనల్ ఎస్పీ రవికుమార్ మాట్లాడుతూ... ‘‘తాడేపల్లి పట్టణ పరిధిలోని నులకపేటకు చెందిన గాజుల హరీష్‌కుమార్ చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. మన్యం జిల్లా పాడేరు దగ్గర విజయకుమార్ అనే వ్యక్తి నుంచి గంజాయి కొనుగోలు చేసేవాడు. ఇక్కడికి తీసుకొచ్చి చిన్న పొట్లాలుగా మార్చి విక్రయిస్తున్నాడు. గంజాయి కేసుల్లో అరైస్టెన పాత నేరస్తులు నాగమణి, రోజాలు ఇటీవలే జైలు నుంచి విడుదలయ్యారు. వీరికి తాడేపల్లి రైల్వేస్టేషన్ వద్ద గాజుల హరీష్‌కుమార్ గంజాయి ఇస్తున్నాడని తాడేపల్లి సీఐ కళ్యాణ్‌రాజుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన సిబ్బందితో మఫ్టీలో కాపు కాసి ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి కేజీ 150 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు’’ తెలిపారు. గంజాయి క్రయవిక్రయాలు చేసిన వారి గురించి ప్రజలు సమాచారం ఇవ్వాలని సూచించారు. వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment