కుష్ఠు వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి
డీపీఎంవో సారంగపాణి
నిజాంపట్నం: కుష్ఠు వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ సారంగపాణి సూచించారు. జాతీయ కుష్ఠు వ్యాధి నివారణ దినోత్సవ కార్యక్రమాలలో భాగంగా మండలంలోని ప్రజ్ఞం పంచాయతీ అట్లవారిపాలెంలో శనివారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. శరీరంపై స్పర్శలేని రాగివర్ణ మచ్చలు ఉండినా, శరీరంపై రంగుమారిన మచ్చలు, పొడలు, లావుగా మారిన నరాలు, నొప్పులతో కూడిన నరాలు, కాళ్లు, చేతుల కండరాలలో బలహీనత, చేతులు, పాదాలు, నరాలలో తిమ్మిర్లు అనిపించటం, కుళ్లు పూర్తిగా మూసుకోలేకపోవటం, చెవి తమ్మెలు మందంగా మారటం, చర్మం, చెవి తమ్మెలపై బుడిపెలు ఉండటం వంటి లక్షణాలు కనిపిస్తాయన్నారు. ఆయా లక్షణాలు కనిపించిన వారు వెంటనే వైద్యశాలలో సంప్రదించి చికిత్స పొందాలని సూచించారు. గ్రామంలో పలువురికి వైద్యపరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో డీపీఎంవో వెంకటేశ్వర్లు, సూపరవైజర్ మురళి, ఆశా కార్యకర్త రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment