![టింబర](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06prc153-260051_19_31_mr-1738871403-0.jpg.webp?itok=VLVSmTaM)
టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
పర్చూరు(చినగంజాం): బాపట్ల జిల్లా పర్చూరులోని ఓ టింబర్ డిపోలో బుధవారం అర్ధరాత్రి తీవ్ర అగ్ని ప్రమాదం సంభవించింది. పర్చూరు–చీరాల రోడ్డులో ఉన్న నాగేశ్వరి టింబర్ డిపోలో అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలు భారీగా ఎగిసి పడటంతో డిపో చుట్టు పక్కల గృహాలు, దుకాణాల వారు అప్రమత్తమయ్యారు. ఇళ్లలో ఉన్న నీటితో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. టింబరు డిపోలో ఉన్న దుంగలకు మంటలు అంటుకోవడంతో టింబర్ డిపో అంతా ఒక్కసారిగా వ్యాపించాయి. అగ్నిప్రమాద సమాచారం అందుకున్న ఎస్‌ఐ మాల్యాద్రి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. చీరాల, చిలకలూరిపేట, బాపట్ల నుంచి అగ్నిమాపక దళాలను రప్పించారు. నాలుగు గంటలపాటు తీవ్రంగా శ్రమించి మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ప్రమాదంలో టింబర్ డిపోలోని దుంగలతోపాటు ఒక కారు కూడా పూర్తిగా దగ్ధం కావడంతో జరిగిన నష్టం రూ.కోటికి పైగా ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న రీజనల్ ఫైర్ అధికారి జిలాని, జిల్లా ఫైర్ అధికారి మాధవ నాయుడు సంఘటనా స్థలానికి చేరుకొని కారణాలను పరిశీలించారు. అగ్ని ప్రమాదానికి కారణాలను తెలుసుకునేందుకు క్లూస్ టీంని రంగంలోకి దించారు. డిపో మేనేజర్ శేషబ్రహ్మాచారిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో టింబర్ డిపోలో మంటల వ్యాపించాయని తనకు ఫోన్ వచ్చిందని శేషబ్రహ్మాచారి తెలిపారు. సమాచారం అందిన వెంటనే టింబర్ డిపోకు వెళ్లి చూడగా డిపో అంతా మంటలు వ్యాపించి ఉన్నాయని కేకలు వేసి చుట్టు పక్కల వారందరినీ అప్రమత్తం చేసినట్లు తెలిపాడు. ఎంత ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాకపోవడంతో పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించినట్లు చెప్పారు.
అర్ధరాత్రి డిపోలో భారీగా
ఎగసి పడిన మంటలు
విద్యుత్ షార్ట్ సర్క్యూట్
కారణమని అనుమానం
రూ.కోటి పైగా నష్టం
ఉంటుందని అంచనా
![టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06prc151-260051_19_31_mr-1738871403-1.jpg)
టింబర్ డిపోలో అగ్ని ప్రమాదం
Comments
Please login to add a commentAdd a comment