![పరిపా](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06rpl26-150152_mr-1738871404-0.jpg.webp?itok=kvIRGqj_)
పరిపాలనలో ఫెయిల్ అయిన సీఎం
వైఎస్సార్ సీపీ రాష్ట్ర
ప్రధానకార్యదర్శి జూపూడి ప్రభాకర్
నగరం: ఎన్నికల సమయంలో దారుణమైన అబద్ధాలు చెప్పి ప్రజల్లో ఆశలు కల్పించి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తివేసిన ఘనుడు సీఎం చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ చెప్పారు. బాపట్ల జిల్లాలోని మండల కేంద్రమైన నగరం వచ్చిన ఆయన మాట్లాడుతూ కూటమి ఇచ్చిన హామీలు అమలుకావని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగానే చెప్పారని గుర్తుచేశారు. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు బాధపడుతున్నారన్నారు. దావోస్ వెళ్లిన సీఎం చంద్రబాబునాయుడుకు ఘోర అవమానం జరిగిందన్నారు. ఒక్క ప్రాజెక్ట్ కూడా రాకపోవడం అంటే కూటమి ప్రభుత్వంపై నమ్మకం లేకపోవడమేనన్నారు. చంద్రబాబు నాయడు పరిపాలనలో పూర్తిగా ఫెయిల్ అయ్యారన్నారు.
విజయకీలాద్రిపై
శ్రీనివాసునికి ప్రత్యేక పూజలు
తాడేపల్లిరూరల్: సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో గురువారం సకల విద్యాప్రాప్తి కోసం హయగ్రీవ హోమాన్ని, హనుమద్వాహన సేవను అంగరంగ వైభవంగా నిర్వహించారు. విజయకీలాద్రి దివ్య క్షేత్ర 8వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం 8.30 గంటలకు హయగ్రీవ హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను, సాయంత్రం శ్రీనివాసునికి అశ్వవాహన సేవ నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
![పరిపాలనలో ఫెయిల్ అయిన సీఎం 1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06mgl66-150134_mr-1738871404-1.jpg)
పరిపాలనలో ఫెయిల్ అయిన సీఎం
Comments
Please login to add a commentAdd a comment