ఆత్మహత్యలే శరణ్యం...
ఎన్నో వ్యయ ప్రయాసలు పడి కంది పంటను పండిస్తే కనీసం కొనే నాథుడే రాకపోవడం దురదృష్టకరం. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర క్వింటాలు రూ.7,550 లభించడం లేదు. ఎకరానికి రెండు క్వింటాలు మాత్రమే దిగుబడి వస్తుండటంతో సుమారుగా రూ.20 వేలకు పైగా నష్టం వాటిల్లుతోంది. ఇంత జరుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చీమ కుట్టినట్టు కూడా లేదు. కంది రైతులకు కూడా పత్తి, మిర్చి రైతుల వలె ఆత్మహత్యలే శరణ్యం.
–పేరుపోగు రామయ్య,
రైతు, ముటుకూరు, దుర్గి మండలం.
Comments
Please login to add a commentAdd a comment