జిల్లా ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే దసరా శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

జిల్లా ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే దసరా శుభాకాంక్షలు

Published Sat, Oct 12 2024 12:18 PM | Last Updated on Sat, Oct 12 2024 12:18 PM

జిల్ల

సూపర్‌బజార్‌(కొత్తగూడెం)/కొత్తగూడెం టౌన్‌: జిల్లా ప్రజలకు కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఎస్పీ బి.రోహిత్‌రాజు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు శుక్రవారం ఒక ప్రకటనలో దసరా శుభాకాంక్షలు తెలిపారు. విజయానికి ప్రతీక అయిన దసరా పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. వేడుకలను ఐకమత్యంతో జరుపుకుని మతసామరస్యం చాటాలని కోరారు. జిల్లాలో చేపట్టిన అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని, అభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలవాలని అమ్మవారిని వేడుకుంటున్నట్లు పేర్కొన్నారు.

కొత్త ఉపాధ్యాయుల రిపోర్టు..

కొత్తగూడెంఅర్బన్‌: డీఎస్సీ–2024లో నూతనంగా ఎంపికై న ఉపాధ్యాయులు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో శుక్రవారం రిపోర్టు చేశారు. ఎంపికై న 413 మంది ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చి రిపోర్టు చేయాలని ఆదేశించగా, కొందరు అందుబాటులో ఉన్నవారు గురువారం, మరికొందరు శుక్రవారం రిపోర్టు చేశారు. అనంతరం నూతన ఉపాధ్యాయులకు కౌన్సిలింగ్‌ ఇచ్చి వారి సబ్జెక్ట్‌లను బట్టి ఖాళీ ఉన్న పాఠశాలలకు కేటాయించనున్నారు.

16న డయాలసిస్‌

సేవలు ప్రారంభం

పాల్వంచ: పాల్వంచ ప్రభుత్వాస్పత్రిలో ఈ నెల 16న డయాలసిస్‌ సేవలను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించనున్నారని డీసీహెచ్‌ఎస్‌ డాక్టర్‌ రవిబాబు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో రూ.40 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిస్‌ సెంటర్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటివరకు జిల్లాలోని కొత్తగూడెంలో 5 యూనిట్లు, ఇల్లెందులో 5, మణుగూరులో 5, అశ్వారావుపేట 5, భద్రాచలంలో 10 యూనిట్లు ఉన్నాయని, చర్లలో 5 యూనిట్లు రెండు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని వివరించారు. జిల్లాలో సుమారు 500 మంది కిడ్నీ బాధితులు ఉన్నారని, పాల్వంచలో 5 యూనిట్లు అందుబాటులోకి రావడం ద్వారా 40 నుంచి 50 మందికి ఇక్కడ సేవలు అందించే వెసులుబాటు ఉంటుందన్నారు. పెయిన్‌ కిల్లర్‌ మందులు వాడటం, ఆర్‌ఎంపీల వద్ద తెలిసీ తెలియని వైద్యం పొందడం, ఆల్కహాలు, పరిమితికి మించి ఆహారం తీసుకోవడం, నీటి లవణాల్లో హెచ్చుతగ్గులు, సరిపడా తాగునీరు తీసుకోవడం వల్ల కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్‌ సూపరింటెండెంట్‌ రాంప్రసాద్‌, ఆర్‌ఎంఓ సోమరాజు దొర పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
జిల్లా ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే దసరా శుభాకాం1
1/1

జిల్లా ప్రజలకు కలెక్టర్‌, ఎస్పీ, ఎమ్మెల్యే దసరా శుభాకాం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement