శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు.. | - | Sakshi
Sakshi News home page

శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు..

Published Sat, Oct 12 2024 12:20 PM | Last Updated on Sat, Oct 12 2024 12:20 PM

శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు..

శ్రీ మహిషాసురమర్దినిగా అమ్మవారు..

పాల్వంచరూరల్‌: శ్రీదేవి శరన్నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని తొమ్మిదో రోజు శుక్రవారం శ్రీ మహిషాసురమర్దినిదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ కనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో రుత్వికులు, అర్చకులు వేదపారాయణం, నవగ్రహజపాలు, శ్రీచక్రార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, రుద్రహోమం, అష్టోత్తర కలాశాభిషేకం తదితర పూజలు నిర్వహించారు. తొలుత అమ్మవారిని మేళతాళాలతో ఉరేగింపుగా ఆలయ ఆవరణంలోని కళావేదిక వద్దకు తీసుకువచ్చి గణపతి, కలశ పూజలు జరిపారు. అనంతరం కలశాలతో దేవాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఉత్సవమూర్తులకు పంచామృతంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ ఎన్‌.రజనీకుమారి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement