కిన్నెరసానిలో న్యాయవాదుల జలవిహారం
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిని శుక్రవారం ప్రభుత్వ( అటవీశాఖ) హైకోర్టు న్యాయవాది ఈ.పూర్ణచందర్రావు, సిటీ సివిల్ కోర్టు ఏజీపీ ఎస్.వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా సందర్శించారు. డీర్ పార్కులోని దుప్పులను, డ్యామ్‌పైనుంచి జలాశయాన్ని, పర్యావరణ కేంద్రాన్ని వీక్షించారు. అనంతరం రిజర్వాయర్‌లో బోటు షికారు చేశారు. వైల్డ్‌లైఫ్ రేంజర్ కవిత మాధురి, ఎఫ్ఎస్ఓ కిషన్, ఎఫ్బీఓ రాములు ఉన్నారు.
19న బహిరంగ విచారణ
కొత్తగూడెంరూరల్: బీసీలకు కల్పించాల్సిన రిజ్వరేషన్పై ఖమ్మం కలెక్టరేట్లో ఈ నెల 19న బహిరంగ విచారణ నిర్వహించన్నుట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి ఇందిర శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని శాసనసభ సభ్యులు, శాసన మండలి సభ్యులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు, బీసీ సంచార జాతుల కుల పెద్దలు, బీసీ సంఘాల నాయకులు విచారణకు హాజరై తమ అఫిడవిట్లను 6 సెట్లలో తెలుగు లేదా ఆంగ్లంలో సమర్పించవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment