ప్రైవేట్ ఆస్పత్రుల్లో దోపిడీని నివారించాలి
సింగరేణి(కొత్తగూడెం): ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీని నివారించాలని ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ (పీవైఎల్) రాష్ట్ర అధ్యక్షకార్యదర్శులు కేఎస్ ప్రదీప్, కార్యదర్శి వాంక్‌డోత్ అజయ్ పేర్కొన్నారు. శుక్రవారం కొత్తగూడెం సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్ ప్రజాపంథా కార్యాలయంలో జరిగిన ముఖ్యకార్యకర్తల సమావేశంలో వాల్ పోస్టర్లు ఆవిష్కరించి మాట్లాడారు. ఆస్పత్రుల దోపిడీ కారణంగా ఏటా 4 శాతం మంది పేదలుగా మారుతున్నారని, జాతీయ కుంటుంబ ఆరోగ్య సంస్థ సర్వేలో ఈ విషయం వెల్లడైందన్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందకపోవటంతో ప్రజలు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. ఆస్పత్రుల యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా వసూళ్లు చేస్తున్న ఫీజులపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment