అంతర్జాతీయ ప్రమాణాలు.. నాణ్యమైన విద్య
● అన్ని వసతులతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ● డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ● లక్ష్మీపురంలో పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన
బోనకల్: ఇతర రాష్ట్రాలకు మండలంలోని లక్ష్మీపురంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల ఆదర్శంగా ఉండాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క ఆకాంక్షించారు. మండలంలోని లక్ష్మీపురంలో 25ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న రెసిడెన్షియల్ పాఠశాలకు శుక్రవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. పేద విద్యార్థులకు ఉచితంగా, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల నిర్మాణానికి రూపకల్పన చేశామని తెలిపారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించడంతో పాటు అనేక సామాజిక రుగ్మతలపై పోరాటం చేసిన చరిత్ర ఉండడంతో లక్ష్మీపురంను ఎంపిక చేశామన్నారు.
గురుకులాల రూపకల్పనలో భట్టి కీలకం
ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం ఏర్పాటుచేస్తున్న రెసిడెన్షియల్ స్కూళ్ల రూపకల్పనలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక పాత్ర పోషించారని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. ఇవి ప్రారంభమైతే ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పారు. వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ మాట్లాడుతూ బీఆర్‌ఎస్ పాలకులు ప్రభు త్వ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తే తమ ప్రభుత్వం చక్కదిద్దుతోందని తెలిపారు. కాగా, సీపీఐ నాయకు డు జమ్ముల జితేందర్‌రెడ్డి, సీపీఎం నుంచి పొన్నం వెంకటేశ్వరావు, బీఆర్‌ఎస్ నాయకుడు ముత్తారపు వెంకటిని భట్టి వేదికపైకి ఆహ్వానించి మాట్లాడించారు. ఈ సందర్భంగా వారు మధిర అభివృద్ధికి పాటుపడుతున్న భట్టి విక్రమార్కకు అండగా నిలవాల్సి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment