పెద్దమ్మతల్లి ఆలయంలో రుద్రాభిషేకం
పాల్వంచరూరల్: కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా పెద్దమ్మతల్లి ఆలయంలో శనివారం అర్చకులు అమ్మవారి సన్నిధిలో రుద్రాభిషేక పూజలు నిర్వహించారు. శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయంలో వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్ శర్మ శివలింగానికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకపూజలు జరిపారు. అనంతరం స్వామివారికి హారతి, మంత్రపుష్పం, తీర్థప్రసాదాల వితరణ చేశారు. కార్తీక మాసం పూర్తయ్యే వరకు స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, సాయంత్రం ఆకాశ దీపోత్సవం, దీపారాధన పూజలు నిర్వహించనున్నట్లు ఈఓ రజనీకుమారి తెలిపారు.
18 నుంచి జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్
అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : ఈ నెల 18వ తేదీ నుంచి మూడు రోజులపాటు అన్నపురెడ్డిపల్లి గురుకుల బాలుర పాఠశాలలో జిల్లాస్థాయి సైన్స్‌ఫేర్ నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తెలిపారు. అన్నపురెడ్డిపల్లిలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించే సైన్స్‌ఫేర్‌లో ఏడు ప్రధాన అంశాలపై పోటీలు ఉంటాయన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొనేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధి కారి ఎం.వెంకటేశ్వరాచారి, డీఎస్‌ఓ ఎస్.చలపతిరాజు, ఏఎంఓ నాగరాజశేఖర్, ఎపంఈఓ ఉండేటి ఆనంద్‌కుమార్, కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ రాధకృష్ణమూర్తి, నాయకులు పర్సా వెంకట్, దుబ్బాకుల రాము పాల్గొన్నారు.
సైన్స్‌ఫేర్‌పై
ఉపాధ్యాయులకు శిక్షణ
కొత్తగూడెంఅర్బన్: ఈ నెల 18, 19, 20 తేదీల్లో అన్నపురెడ్డిపల్లిలో జరిగే జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనకు సంబంధించి జిల్లాలోని ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులకు ఈ నెల 5న శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. పాత కొత్తగూడెంలోని జిల్లా విద్యా శిక్షణ కేంద్రంలో నిర్వహించే శిక్షణకు అన్ని పాఠశాలల నుంచి ఒక్కో ఉపాధ్యాయుడు హాజరుకావాలని సూచించారు.
సింగరేణి అధికారుల బదిలీ
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి సంస్థలో వివిధ ఏరియాల్లో, వివిధ హోదాల్లో పనిచేస్తున్న 24 మంది మైనింగ్ అధికారులను బదిలీ చేస్తూ శనివారం యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో అడిషనల్ జీఎంలు ఇద్దరు, 9 మంది డీజీఎంలు, 8 మంది అడిషనల్ మేనేజర్లు, ఒక డీవైఎస్‌ఈ, సీనియర్ అండర్ మేనేజర్లు ముగ్గురు ఉన్నారు. వీరందరూ ఈ నెల 11న బదిలీ ప్రాంతాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
రాష్ట్రస్థాయి
ఈత పోటీల్లో ప్రతిభ
సింగరేణి(కొత్తగూడెం): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో కొత్తగూడెం విద్యార్థులు ప్రతిభ చాటారు. శనివారం హైదరాబాద్‌లోని జియాన్ స్పోర్ట్స్ అకాడమీలో రాష్ట్రస్థాయి ఈత పోటీలు నిర్వహించగా, కొత్తగూడెం విద్యార్థులు ఐదు పఽతకాలు సాధించారు. నవభారత్ పబ్లిక్ స్కూల్ విద్యార్థి కొట్టే సాయిశ్రీ వాత్సవ్ మూడు కాంస్య పఽతకాలు, బండారి నాగచైతన్య రెండు కాం స్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను నవభారత్ పబ్లిక్ స్కూల్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎంవీరెడ్డి, స్విమ్మింగ్ కోచ్ హనుమంతరాజు, సామ్యుల్, సంధ్య, సామంత్ అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment