ఉద్యోగుల సహకారంతోనే సామాజిక సేవ
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఉద్యోగుల సహకారంతోనే టీజీ ఎన్పీడీసీఎల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు విద్యుత్ శాఖ ఎస్ఈ జి.మహేందర్ తెలిపారు. తన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతీ నెల ప్రతీ ఉద్యోగి నుంచి కొంత మొత్తాన్ని విరాళంగా సేకరిస్తున్నామని, ఈ డబ్బును ఆనాథాశ్రమాలు, సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహించే సంస్థలకు అందజేయాలని నిర్ణయించామని వివరించారు. అంతకుముందు పాల్వంచలో నిర్వహిస్తున్న శాంతి వెల్ఫేర్ అసోసియేషన్(దివ్యాంగుల పాఠశాల)కు తొలి సాయంగా రూ. 20 వేల చెక్కును నిర్వాహకురాలు కె.క్రిస్టోలైట్కు అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కె. శ్రీధర్, పాల్వంచ డీఈ పి.ఎస్.వి.ఎస్. నందయ్య, టెక్నికల్ ఏడీఈ కె.రాంప్రసాద్, కొత్తగూడెం ఏడీఈ జి.లక్ష్మి, టెక్నికల్ ఏఈ ఆర్.మానస తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ శాఖ ఎస్ఈ మహేందర్
Comments
Please login to add a commentAdd a comment