‘ఆయుష్మాన్ భారత్’లో పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లా ఎంపి
కొత్తగూడెంరూరల్: ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య ఖాతా(అభ) కార్యక్రమం కింద హెల్త్ ప్రొఫైల్ నమోదుకు పైలెట్ ప్రాజెక్ట్‌గా జిల్లాను ఎంపిక చేసినట్లు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ జాయింట్ డైరెక్టర్ మంజూనాథ్ నాయక్ తెలిపారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని పలు పీహెచ్‌సీలను ఆయిన సందర్శించారు. అనంతరం కలెక్టరేట్‌లోని వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో డీఎంహెచ్‌ఓ ఎల్.భాస్కర్‌నాయక్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయిన మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతీ ఒక్కరి ఆరోగ్య వివరాలను ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఐడీలో నమోదు చేయాలని సూచించారు. ఈ ఐడీ కార్డు పొందేందుకు సమీపంలోని పీహచ్‌సీ లేదా ప్రభుత్వ ఆస్పత్రుల్లో సంప్రదించాలని తెలిపారు. జిల్లాలోని 29 పీహెచ్‌సీలు, ఐదు యూపీహెచ్‌సీల్లో కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైందని చెప్పారు. ఈ డిజిటల్ కార్డులో కీలక మైన ఆరోగ్య సమాచారం ఉంటుందని, ఆస్పత్రుల్లో నగదు రహిత చికిత్స, ఇతర అరోగ్య సంరక్షణ సేవలకు ఇది ఉపకరిస్తుందని వివరించారు. ఈ అవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమావేశంలో డిఫ్యూటీ డెమో ఫయిజ్ మోహిద్దీన్, డీపీఓ సరిత, అకౌంటెంట్ భానుప్రసాద్, రెహ్మాన్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment