అశ్వారావుపేటరూరల్: జిల్లావ్యాప్తంగా పదివేల ఎకరాల్లో మునగ పంట సాగు లక్ష్యంగా జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ప్రణాళికలు సిద్ధం చేశారని, దీంట్లో భాగంగా ఇప్పటికే రెండు వేల ఎకరాల్లో పంట సాగును మొదలు పెట్టినట్లు డీఆర్‌డీఏ ఏపీడీ నల్లబోతుల రవి తెలిపారు. శనివారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బంది, కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీడీ మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం నిధులు నిరుపయోగం కావొద్దన్నారు. వ్యక్తిగత మరుగుదొడ్లు లేని గృహాలను గుర్తించి, జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మునగ సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, సాగు చేసేందుకు ముందుకు వచ్చే రైతులకు అన్ని విధాలుగా సహకారం అందించాలని సూచించారు. మునగతోపాటు వెదురు సాగుపై కుడా దృష్టి పెట్టాలని చెప్పారు. సమావేశంలో ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంపీఓ సోయం ప్రసాద్, ఈజీఎస్ ఏపీఓ రామచంద్రరావు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment