30 నుంచి ఉర్సే షరీఫ్ ఉత్సవాలు
ఇల్లెందురూరల్: మండలంలోని హజరత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్‌లో కులమతాలకు అతీతంగా నిర్వహించే ఉర్సే షరీఫ్ ఉత్సవాలు నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రచార పోస్టర్‌ను ఉత్సవ కమిటీ ప్రతినిధులు బుధవారం ఆవిష్కరించారు. మండలంలోని సత్యనారాయణపురం గ్రామ శివారు అటవీ ప్రాంతంలో హజరత్ నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్‌లో కొలువుదీరిన నాగుల్‌మీరా సమక్షంలో ఉర్సు ఉత్సవాలు ఏటా ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. 22వ ఉర్సు ఉత్సవాల కోసం దర్గా ముస్తాబవుతోంది. ఏటా పట్టణంలోని హజరత్ ఖాసీం దుల్హా దర్గాహ్ షరీఫ్‌లో కార్తీక పౌర్ణమి రోజున ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తారు. తిరిగి మండలంలోని సత్యనారాయణపురం గ్రామ శివారులోని నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్‌లో అమావాస్య రోజు వరకు ఉత్సవాలు కొనసాగుతాయి. ఉర్సే షరీఫ్ ఉత్సవాల్లో భాగంగా పట్టణంలోని హజరత్ ఖాసీం దుల్హా దర్గా షరీఫ్ నుంచి ఈ నెల 30 తేదీన సాయంత్రం 5 గంటలకు చాదర్‌ను, సాయంత్రం 6 గంటలకు సందల్‌ను ఊరేగింపుగా నాగుల్‌మీరా మౌలా చాన్ దర్గా షరీఫ్‌కు చేరుస్తారు. డిసెంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు హజరత్ ఖాసీం దుల్హా దర్గాహ్ షరీఫ్ నుంచి భారీ జులూస్ ప్రారంభమై నాగుల్‌మీరా మౌలాచాన్ దర్గా షరీఫ్ వరకు కొనసాగుతుంది. దర్గాలో మధ్యాహ్నం 12 గంటలకు దావతే హజరత్, సాయంత్రం 6 గంటలకు సలామీ, రాత్రి 7 గంటలకు ఖవ్వాలి నిర్వహిస్తామని నిర్వాహకులు వివరించారు.
హజరత్ నాగుల్‌మీరా
మౌలా చాన్ దర్గాలో ఏర్పాట్లు
Comments
Please login to add a commentAdd a comment