నివేదికలు సకాలంలో పూర్తి చేయాలి
ఎంఈఓల సమావేశంలో
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
కొత్తగూడెంఅర్బన్: మండల విద్యాధికారులు విద్యా సంబంధిత నివేదికలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ సూచించారు. శుక్రవారం ఆనందఖని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మండల విద్యాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి సోమవారం మండలస్థాయిలో అన్ని రిపోర్టులను అప్డేట్ చేసుకుని సబ్మిట్ చేయాలని సూచించారు. ప్రతీ విద్యార్థికి యూడైస్‌లో ఆధార్ నంబర్ ఎంటర్ చేసి, ఐడీ జనరేట్ చేయాలని అన్నారు. ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్‌ను ప్రతి పాఠశాలలో నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ (ఎస్ఎంఎస్)లో యూనిఫాం డేటాను అప్డేట్ చేయాలని, పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ (పీటీఎం) రిపోర్ట్‌లను స్కూల్ ఎడ్యుకేషన్ పోర్టల్ అదే రోజు అప్డేట్ చేయాలని సూచించారు. ప్రశస్త్ యాప్ ద్వారా విద్యార్థులను స్కీన్రింగ్ చేసి రిపోర్ట్ అప్డేట్ చేయడం, విద్యాంజలి పోర్టల్ అన్ని పాఠశాలలను రిజిస్ట్రేషన్ చేసి అప్డేట్ చేయాలని, మధ్యాహ్న భోజనం లో మెనూ పాటిస్తూ, నాణ్యత కలిగిన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలని ఆదేశించారు. డిసెంబర్ 3న జరిగే ఎన్ఏఎస్ పరీక్షకు విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి, ప్లానింగ్ కోఆర్డినేటర్ సతీష్‌కుమార్, జిల్లా సమ్మిళిత విద్యా కోఆర్డినేటర్ ఓ.సైదులు, మండల విద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment