సమష్టిగా కృషి చేయాలి
మణుగూరు టౌన్: నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యసాధన కోసం అధికారులు, కార్మికులు సమష్టిగా కృషి చేయాలని డైరెక్టర్ (పీఅండ్‌పీ), (పా) జి.వెంకటేశ్వరరెడ్డి సూచించారు. బుధవారం సింగరేణి మణుగూరు ఏరియాలో పర్యటించిన ఆయన ఏరియా జీఎం దుర్గం రాంచందర్, పీఓ లక్ష్మీపతిగౌడ్, ప్రాజెక్ట్ అధికారులతో కలిసి వ్యూ పాయింట్ల నుంచి ఓసీ–2, మణుగూరు ఓసీ, ఓసీ–4 గనుల్లో బొగ్గు ఉత్పత్తిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అధి కారులు శ్యాంసుందర్, సురేశ్, రమణారెడ్డి, శ్రీని వాసచారి, రాజేశ్వరరావు, చిట్టా శ్రీనివాస్, రాజేశ్వరరావు, కట్ల శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment