నాణ్యమైన భోజనం పెట్టండి
చండ్రుగొండ : విద్యార్థినులకు నాణ్యమైన భోజనం పెట్టాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.వెంకటేశ్వరాచారి సిబ్బందికి సూచించారు. స్థానిక కస్తూర్బా గాంధీ విద్యాలయాన్ని బుధవారం ఆయన సందర్శించారు. కేజీబీవీలో తయారు చేస్తున్న వంటలను పరిశీలించి, బాలికలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని చెప్పారు. కస్తూర్బా విద్యాలయాల ఉపాధ్యాయులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో విద్యార్థినుల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఆయన వెంట ఎంఈఓ సత్యనారాయణ ఉన్నారు.
టాలెంట్ టెస్ట్‌కు స్పందన..
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ బయాలజికల్ సైన్స్ ఫోరం ఆధ్వర్యంలో పాతకొత్తగూడెంలోని తెలంగాణ పాఠశాలలో బుధవారం జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. జిల్లాలోని 23 మండలాల నుంచి విద్యార్థులు హాజరు కాగా, విజేతలకు డీఈఓ వెంకటేశ్వరాచారి బహుమతులు ప్రదానం చేశారు. అశ్వాపురానికి చెందిన వి.విశాల్ ప్రథమ బహుమతి సాధించగా, టేకులపల్లి పాఠశాల విద్యార్థిని ఎన్.గీత ద్వితీయ బహుమతి గెలుచుకుంది. మూడో బహుమతిని సారపాకకు చెందిన అలివేలు సాధించింది. కాగా, జిల్లా స్థాయిలో ఎంపికై న విద్యార్థులకు రాష్ట్ర స్థాయి పోటీలు ఆన్‌లైన్‌లో జరుగుతాయని డీఈఓ తెలిపారు. కార్యక్రమంలో టీబీఎస్‌ఎఫ్ గౌరవాధ్యక్షుడు మాధవరావు, శ్రీనివాసరావు, ఎంఈఓ ప్రభుదయాళ్, ఫోరం అధ్యక్షురాలు సునందిని, జనరల్ సెక్రెటరీ విజయభాస్కర్ పాల్గొన్నారు.
డీఈఓ వెంకటేశ్వరాచారి
Comments
Please login to add a commentAdd a comment