అశ్వారావుపేట: ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న వ్యక్తిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. అశ్వారావుపేట సీఐ టీ.కరుణాకర్ కథనం ప్రకారం.. ఎస్‌ఐ యయాతి రాజు, సిబ్బంది జంగారెడ్డిగూడెం రోడ్‌లో సాయిబాబా ఆలయం వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో బైక్‌పై వస్తున్న ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా యాదవోలు గ్రామానికి చెందిన మారం మునియ పోలీసులను చూసి తడబడ్డాడు. బైక్ వెనక్కు మళ్లిస్తుండగా పోలీసులు పట్టుకుని విచారించారు. దీంతో ద్విచక్రవాహనాలు చోరీ చేస్తున్నట్లు అంగీకరించాడు. చోరీ కేసుల్లో గతంలో రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష కూడా అనుభవించాడు. బయటికొచ్చాక మళ్లీ చోరీలు చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణ సరిహద్దు జిల్లాల్లో 8 ద్విచక్ర వాహనాలను చోరీ చేసి, ఓ వాహనాన్ని అమ్మేందుకు తీసుకొస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని కోర్టులో హాజరుపర్చినట్లు సీఐ తెలిపారు. కాగా మునియపై 61 ద్విచక్ర వాహన చోరీ కేసులు ఉన్నాయని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment