అందరికీ మంచి జరగాలి
జిల్లా జడ్జి పాటిల్ వసంత్
కొత్తగూడెంటౌన్: నూతన సంవత్సరంలో అందరికీ మంచి జరగాలని జిల్లా జడ్జి పాటిల్ వసంత్ ఆకాంక్షించారు. ఆలిండియా లాయర్స్ యూనియన్(ఐలూ) ఆధ్వర్యంలో రూపొందించిన క్యాలెండర్లను కొత్తగూడెం కోర్టులో మంగళవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. న్యాయవాదుల పని ప్రణాళికల రూపకల్పనకు ఈ క్యాలెండర్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. కార్యక్రమంలో ఐలూ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లి సత్యనారాయణ, న్యాయమూర్తులు బి.రామారావు, ఎ.సుచరిత, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ, ఐలూ జిల్లా కార్యదర్శి రమేష్‌కుమార్ మక్కడ్, జె.వి.శివరాం ప్రసాద్, పి.కిషన్‌రావు, రావిలాల రామారావు, జీకే అన్నపూర్ణ, జి.సునంద, అరికల రవికుమార్, తోట మల్లేశ్వరరావు, నల్లమల్ల ప్రతిభ, పీపీ పి.వి.డి.లక్ష్మి, లావణ్య పాల్గొన్నారు.
పెద్దమ్మగుడిలో దుకాణాలకు 3న వేలం
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని శ్రీకనకదుర్గ (పెద్దమ్మతల్లి) ఆలయానికి చెందిన రెండు ఏసీ ఫంక్షన్‌హాళ్లు, కొత్త కాంప్లెక్స్‌లోని 4వ నంబర్ షాప్ నిర్వహణకు మూడేళ్ల పాటు లీజు, లైసెన్స్ హక్కులు పొందేందుకు ఈనెల 3న వేలం నిర్వహిస్తున్నట్లు ఈఓ ఎన్.రజినీకుమారి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంకా పోగుచేసిన చీరల అమ్మకం, పాత కాంప్లెక్స్‌లోని ఒకటో నంబర్ షాపులో బొమ్మలు, బల్లలు, ఇతర వస్తువుల అమ్మకానికి కూడా వేలం ఉంటుందని వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల వరకు తగిన రుసుము చెల్లించి దేవస్ధానం కార్యాలయంలో షెడ్యూల్ పొందాలని, నగదు లేదా డీడీ చెల్లించి వేలంలో పాల్గొనాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment