బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలి
ఎస్పీ రోహిత్‌రాజు
కొత్తగూడెంటౌన్: బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడం అందరి బాధ్యత అని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. గురువారం ఎస్పీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆపరేషన్ స్మైల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. పోలీసు అధికారులు, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక, విద్య, ఆరోగ్యశాఖ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని ఐదు సబ్ డివిజన్లలో 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, ఈ నెల 31వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు. తప్పిపోయిన పిల్లలను, కిరాణాషాపులు, మెకానిక్ షాపులు, హోటల్స్, ఫ్యాక్టరీలలో పని చేస్తున్న బాల కార్మికులను గుర్తించి విముక్తి కల్పించాలన్నారు. భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చి అప్పగించాలని సూచించారు. లేకపోతే చైల్డ్ కేర్ హోమ్‌కు పంపించాలని చెప్పారు. పిల్లలతో బలవంతంగా భిక్షాటన, వెట్టి చాకిరీ చేయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాల కార్మికులు కనిపిస్తే 1098/100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్‌కుమార్ సింగ్, ఆపరేషన్స్ స్మైల్ పోలీస్ నోడల్ ఆఫీసర్ డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, డీసీఆర్‌బీ డీఎస్పీ మల్లయ్యస్వామి గౌడ్, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డీడబ్ల్యూఓ స్వర్ణలత లెనినా, సీడబ్ల్యూసీ సభ్యులు అంబేద్కర్, సాధిక్‌పాషా, కార్మిక శాఖ అధికారులు షర్ఫుద్దీన్, నాగరాజు, ఏసుపాదం, డీసీపీఓ హరికుమారి, చైల్డ్ లైన్ కోఆ ర్డినేటర్ సందీప్, ఏహెచ్‌టీయూ ఇన్‌స్పెక్టర్ నాగరాజురెడ్డి, షీటీం ఎస్సై పి.రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment