న్యూ ఇయర్ బేబీస్
భద్రాచలంఅర్బన్: నూతన సంవత్సర ప్రారంభం రోజు బుధవారం భద్రాచలం ఏరియా ఆస్పత్రి, మరో ప్రైవేటు ఆస్పత్రిలో 10 మంది శిశువులు జన్మించారు. భద్రాచలం, బూర్గంపాడు, మణుగూరు, అశ్వాపురం, ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన ఏడుగురు మహిళలు ప్రభుత్వాస్పత్రిలో కాన్పు పొందారు. పట్టణంలోని జీవన్ ప్రైవేట్ ఆస్పత్రిలో కుక్కునూరు(ఏపీ)కు చెందిన నాగలక్ష్మి కవల ఆడ పిల్లలకు జన్మనిచ్చింది. అదే ఆస్పత్రిలో మరో మహిళ కూడా బిడ్డకు జన్మనిచ్చింది. నూతన సంవత్సరం సందర్భంగా భద్రాచలంలో 10 మంది శిశువులు జన్మించగా, వీరిలో ఐదుగురు మగమహారాజులు, ఐదుగురు కనక మహాలక్ష్మిలు ఉన్నారు. ఈ మేరకు ఆస్పత్రి వర్గాలు గురువారం వివరాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment