విద్యార్థుల్లో స్కిల్స్ పెంపొందించాలి
● సెల్ఫీ పాయింట్ ఆకర్షణీయంగా ఉండాలి ● ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో కంప్యూటర్ స్కిల్స్‌ను కూడా పెంపొందించాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ ఆదేశించారు. గురువారం ఐటీడీఏలోని పీఎంఆర్‌సీ భవన సమావేశ మందిరంలో ఏటీడీఓలకు, పీజీ హెచ్‌ఎంలకు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు శిక్షణ శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ మూడో తరగతి నుంచే కంప్యూటర్ పాఠ్యాంశాలను సిలబస్‌లో చేర్చాలన్నారు. అనంతరం ఐటీడీఏ ప్రాంగణంలోని గిరిజన మ్యూజియాన్ని అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు. గిరిజన మ్యూజియానికి వచ్చే పర్యాటకులు, భక్తులను ఆకట్టుకునేలా సెల్ఫీ పాయింట్, లైటింగ్ ఉండాలని, ఫెన్సింగ్ మల్టీకలర్‌లో ఉండాలని చెప్పారు. స్వాగత ద్వారం వరకు విద్యుత్ దీపాలను అలంకరించాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో అధికారులు మణెమ్మ, విజయలక్ష్మి, డేవిడ్ రాజ్, రమణయ్య, రాములు, అశోక్ కుమార్, చంద్రమోహన్, రాధమ్మ, జహీరుద్దీన్, సత్యవతి, నారాయణరెడ్డి, ఉదయ్ కుమార్, హరికృష్ణ, మునీర్ పాషా, హరీష్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.
ముక్కోటి ఉత్సవాలకు ఆహ్వానం
ఈ నెల 9,10వ తేదీల్లో శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే తెప్పోత్సవం, ఉత్తర ద్వార దర్శనం వేడుకలకు రావాలని ఆలయ ఈఈ రవీందర్ ఆహ్వాన పత్రికను పీఓ రాహుల్‌కు అందచేశారు. పండితులు శాలువాతో సత్కరించి వేదాశీర్వచనం చేసి ప్రసాదాలను అందచేశారు. కాగా తెప్పోత్సవం జరిగే గోదావరి తీరం వద్ద సైతం ఆదివాసీ చిత్రాలతో, విద్యుత్ దీపాలతో సెల్ఫీ పాయింట్‌ను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment