విద్యార్థులను పరీక్షలకు సన్నద్ధం చేయాలి
ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ యాదగిరి
టేకులపల్లి : త్వరలో జరగబోయే ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధం చేయాలని ఇంటర్ బోర్డ్ డిప్యూటీ సెక్రటరీ సీహెచ్.యాదగిరి అధ్యాపకులకు సూచించారు. మంగళవారం ఆయన టేకులపల్లిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అధ్యాపకులు పాఠాలు బోధించడమే కాకుండా విద్యార్థుల జీవితాల్లో మార్పు తేవాలని, నైపుణ్యాలు, నైతిక విలువలు పెంచాలని అన్నారు. కార్యక్రమంలో డీఐఈఓ హెచ్. వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపాల్ బి.సులోచనారాణి, అధ్యాపకులు బసవమ్మ, సత్యవతి, ముంతాజ్ అలీ, శంకర్‌రావు, వేణుగోపాల్, శ్రీనివాసరావు, యాకూబ్, వరలక్ష్మి, ప్రమోద్‌కుమార్, నాగేశ్వరరావు, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment