నేత్రపర్వంగా రామయ్య నిత్య కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
పెద్దమ్మతల్లికి
సువర్ణ పుష్పార్చన
పాల్వంచరూరల్ : మండల పరిధిలోని కేశవాపురం – జగన్నాథపురం గ్రామాల మధ్య కొలువుదీరిన శ్రీ పెద్దమ్మతల్లి అమ్మవారికి గురువారం 108 సువర్ణ పుష్పాలతో వైభవంగా అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి నివేదన, హారతి సమర్పించి మంత్రపుష్పం పఠించారు.కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, వేదపడింతులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఓవరాల్ చాంపియన్‌గా కేటీపీఎస్
పాల్వంచ: టీఎస్ జెన్‌కో ఇంటర్ ప్రాజెక్ట్స్ బాస్కెట్‌బాల్, హాకీ టోర్నమెంట్‌లో ఓవరాల్ చాంపియన్‌గా కేటీపీఎస్ 5, 6 దశల జట్లు నిలిచాయి. గత మూడు రోజులుగా స్థానిక విద్యుత్ కళాభారతి క్రీడా మైదానంలో జరుగుతున్న పోటీలు గురువారం ముగిశాయి. బాస్కెట్ బాల్‌లో కేటీపీఎస్ 7వ దశపై కేటీపీఎస్ 5, 6 దశల జట్టు 44–22 తేడాతో గెలుపొందింది. హాకీలో భూపాలపల్లి జట్టుపై 2–0 గోల్స్ తేడాతో కేటీపీఎస్ 5,6 దశల జట్టు గెలుపొందింది. విజేతలకు జెన్‌కో డైరెక్టర్(థర్మల్) బి.లక్ష్మయ్య బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. క్రీడాకారులు జాతీయ స్థాయిలో సత్తా చాటాలన్నారు. కార్యక్రమంలో కేటీపీఎస్ కాంప్లెక్స్ సీఈలు పి.వెంకటేశ్వరరావు, ఎం.ప్రభాకర్ రావు, శ్రీనివాసబాబు, ఎస్‌ఈ మోక్షవీర్, జెన్‌కో స్పోర్ట్స్ ఆఫీసర్ లోహిత్ ఆనంద్, గేమ్స్ సెక్రటరీ వీరస్వామి, వైటీఎంకే.రాజు, కట్టా శ్రీదర్, బరగడి రామారావు, తోట అనిల్, రిఫరీలు ఇలియాజ్, ఆరీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment