జిల్లా స్థాయి పోటీల్లో సత్తా
సూపర్‌బజార్(కొత్తగూడెం)/చర్ల/దమ్మపేట : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి వ్యాసరచన, వక్తృత్వ, చిత్రలేఖనం పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో 150 మంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొని అద్భుత ప్రతిభ చాటారు. సీనియర్ విభాగం వక్తృత్వ పోటీలో భద్రాచలం బాలికోన్నత పాఠశాల విద్యార్థిని ఎం.లలిత, నారాయణపురం విద్యార్థి వై.డింపు, పాత కొత్తగూడేనికి చెందిన ఎండీ. జైనాబ్, జూనియర్స్ విభాగంలో భద్రాచలంలోని కొర్రాజులగుట్ట బాలికోన్నత పాఠశాల విద్యార్థిని కె.భాగ్యశ్రీ, పాల్వంచ ఉన్నత పాఠశాల విద్యార్థి కె.కుందన్‌కుమార్, చర్ల మండలం తేగడ పాఠశాల విద్యార్థిని పి.అక్షిత ప్రతభ కనబర్చారు. చిత్రలేఖనం సీనియర్స్ విభాగంలో పాల్వంచ బాలికోన్నత పాఠశాల విద్యార్థిని ఎస్‌కే సోఫియా బర్కత్, అశ్వాపురం జెడ్‌పీహెచ్‌ఎస్‌కు చెందిన ఆర్.సంధ్య, జగన్నాథపురం పాఠశాల విద్యార్థి ఏసుమణి విజేతలుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో అశ్వారావుపేట జవహర్ విద్యాలయానికి చెందిన ఎల్.అశ్విత, జగన్నాథపురం విద్యార్థిని ఎల్.స్రవంతి, దమ్మపేట మండలం పట్వారిగూడెం విద్యార్థిని కె.వర్షిత ప్రతిభ చాటారు. వ్యాసరచన సీనియర్స్ విభాగంలో భద్రాచలం పాఠశాల విద్యార్థి జి.హర్షవర్థన్, పాల్వంచకు చెందిన ఎస్.చరణ్, తేగడ ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్‌డీ ఖైరున్నీసా విజేతలుగా నిలిచారు. జూనియర్స్‌లో పాల్వంచ జెడ్‌పీహెచ్‌ఎస్ విద్యార్థిని ఎం.చైత్ర, పాల్వంచలోకి కరకవాగు పాఠశాలకు చెందిన బి.అనన్య, అశ్వారావుపేట జవహర్ విద్యాలయానికి చెందిన ఎల్.అశ్వితసాయి విజేతలుగా నిలిచారు. కార్యక్రమంలో డీఈఓ ఎం. వెంకటేశ్వరాచారి, ఎలక్షన్ సెల్ తహసీల్దార్లు దారా ప్రసాద్, రంగాప్రసాద్, డీఎల్‌ఎంటీ పూసపాటి సాయికృష్ణ, నవీన్, అశోక్ పాల్గొనగా న్యాయ నిర్ణేతలుగా శ్రీనివాస్, శైలజ, కృష్ణమోహన్, రమేష్, వరలక్ష్మి, సుశాంత్, అర్జున్, రాము వ్యవహరించారు.
Comments
Please login to add a commentAdd a comment