సమన్వయంతో పని చేయాలి
దమ్మపేట : ఆయిల్‌ఫెడ్ అఽధికారులు సమన్వయంతో, రైతులకు మేలు చేసేలా పనిచేయాలని ఆయిల్ ఫెడ్ సలహా మండలి సభ్యుడు అలపాటి రామచంద్ర ప్రసాద్ అన్నారు. మండలంలోని అల్లిపల్లిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆయిల్ ఫెడ్ అధికారుల పనితీరు రైతుల పాలిట శాపంలా మారేలా ఉందన్నారు. సత్తుపల్లి మండల పరిధిలోని రేగళ్లపాడు నర్సరీలో అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపంతో మొక్కలు సాగుకు పనికిరాకుండా పోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. ఆయిల్ ఫెడ్‌లో సమస్యలు ఉంటే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. ఆయన వెంట పామాయిల్ రైతు సంఘం నాయకులు సీతారామస్వామి, శీమకుర్తి వెంకటేశ్వరరావు, కేవీ, కొయ్యల అచ్యుతరావు, సోయం ప్రసాద్, కాసాని నాగప్రసాద్, జూపల్లి రమణారావు, ఎర్రా వసంతరావు, బుద్దే కోటేశ్వరరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment