![Baby Accessories: Kicks And Crawl Organic Products Amid Covid 19 - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/19/KICKS-AND-CRAWL.jpg.webp?itok=Px8WX7ji)
హైదరాబాద్: ప్రస్తుత మహమ్మారి నేపథ్యంలో ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను మరింత పటిష్టం చేసినట్లు కిక్స్ అండ్ క్రాల్ ఒక ప్రకటనలో పేర్కొంది. పసి పిల్లల అవసరాలు నెరవేర్చడానికి సంబంధించి తల్లుల మనస్సుల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తమ కంపెనీ, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఉత్పత్తుల్లో ‘ఆర్గానిక్’ విధానానికి పెద్ద పీట వేస్తున్నట్లు తెలిపింది.
పసి పిల్లలకు అవసరమైన క్లాతింగ్, బేబీ యాక్సెసరీస్, మెటర్నిటీ వియర్, సాక్స్ వంటి పలు రకాల ఉత్పాదనల విషయంలో తల్లిదండ్రులకు తమ బ్రాండ్‌పై ఉన్న ప్రత్యేక అభిమానాన్ని మరింత పరిపుష్టం చేసుకోవడంలో భాగంగా తాజా ప్రొడక్టులను తీసుకువస్తున్నట్లు వివరించింది. తమ సొంత వెబ్‌సైట్‌తోపాటు అమెజాన్, అజియో, ఫస్ట్ క్రై, మింత్రా, నైకా ఫ్యాషన్ వంటి మార్కెట్ ప్లేస్ వేదికలపై అన్ని రకాల నాణ్యమైన, విభిన్న ప్రొడక్టులు అందుబాటు ధరల్లో లభ్యమవుతాయని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment