చంద్రుని కీలక మిషన్లకు సంబంధించి చైనా వేగంగా ప్రణాళికలు రచిస్తుంది. ఇప్పటికే చైనా జనవరి 2019లో చంద్రుని సుదూర వైపున ఒక ప్రోబ్ ను పంపిన మొదటి దేశంగా ప్రత్యేకతను సంపాదించింది. ఇప్పుడు చంద్రుని మీదకు మానవులను తీసుకెళ్లాడానికి సంబంధించి చైనా తన పరిధిని విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. చంద్రునిపై మానవ సహిత ల్యాండింగ్ ప్రాజెక్టు కోసం వేగంగా చర్యలు తీసుకుంటోంది. "చంద్రుని మీద మానవ సహిత ల్యాండింగ్ కోసం వ్యవస్థను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో" చైనా ప్రయత్నిస్తున్నట్లు జియామెన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ ప్రచురించిన ఒక సంక్షిప్త వార్తా నివేదిక పేర్కొంది.
ఈ నివేదికలో చంద్ర మీదకు మానవులను తీసుకెళ్లే ప్రాజెక్టును "జాతీయ ప్రాజెక్టు"గా చైనా పరిగణిస్తున్నట్లు తెలుస్తుంది. వివిధ అనుబంధ ప్రాజెక్టులకు నాయకత్వం వహించే వ్యక్తుల పేర్లను కూడా ఈ నివేదిక పేర్కొంది. చైనా అకాడమీ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ(కాస్ట్)లోని పలువురు సభ్యులు, ప్రభుత్వ యాజమాన్యంలోని చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం కలిసి ఈ ప్రయోగ వాహనం కోసం పనిచేస్తున్నారు. నివేదిక తెలిపిన వివరాల ప్రకారం, ల్యాండర్ అభివృద్ధి కోసం ఏ ప్రణాళికలు రచిస్తున్నారో సమావేశంలో స్పష్టంగా వెల్లడించలేదు. ఈ ఏడాది ప్రారంభంలో చైనా కూడా చంద్రని మీదకు మానవులను తీసుకెళ్లాడానికి సూపర్-హెవీ లాంచ్ వాహనాలపై పనిచేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే ఐదేళ్లలో చైనా అకాడమీ ఆఫ్ లాంచ్ వెహికల్ టెక్నాలజీ(సీఏఎల్ టీ) కొత్త తరం సిబ్బంది మూన్ లాంఛ్ వెహికల్ తో పాటు భారీ లాంచ్ వాహనాన్ని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment