Elon Musk admits he has a secret Instagram account What it Means - Sakshi
Sakshi News home page

Elon Musk : ట్విటర్‌ పని అయ్యింది.. ఇప్పుడు ఇన్‌స్టా వంతా?

Published Tue, May 24 2022 1:32 PM | Last Updated on Tue, May 24 2022 2:23 PM

Elon Musk admits he has a secret Instagram account What it Means - Sakshi

ప్రపంచ కుబేరుడు ఈలాన్‌ మస్క్‌ చర్యలు ఉహాతీతంగా ఉంటాయి. ప్రొఫెషనల్‌గా, పర​​​‍్సనల్‌గా మిగిలిన ప్రపంచానికి భిన్నంగా చాలా అడ్వాన్స్‌డ్‌గా ఈలాన్‌ మస్క్‌ ఆలోచనలు కొనసాగుతాయి. ఈలాన్‌ నుంచి ఓ ప్రకటన, ఒక లీక్‌ వెలువడింది అంటే భవిష్యత్తులో ఆ అంశానికి సంబంధించి ఏదో సంచలనం జరగబోతుందని అర్థం. ఇందుకు తాజా ఉదాహారణ ట్విటర్‌ వ్యవహారం.

ఇన్‌స్టా ఖాతా
ఈలాన్‌ మస్క్‌ ఉన్నట్టుండి ఓ తాజా అప్‌డేట్‌ను బయట పెట్టారు. ఇప్పటి వరకు ఎవరి తెలియని సీక్రెట్‌ని ఎవరూ అడగకుండానే చెప్పేశారు. ఇప్పటి వరకు సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో అధికారికంగా ఈలాన్‌మస్క్‌కి ట్విటర్‌ అకౌంట్‌ మాత్రమే ఉందని బయటి ప్రపంచానికి తెలుసు, కానీ తనకు ఇన్‌స్టా అకౌంట్‌ కూడా ఉందంటూ ఈలాన్‌ మస్క్‌ ప్రకటించారు. తన ఫ్రెండ్స్‌ పంపే ఫైల్స్‌ చూసేందుకు ఈ ఇన్‌స్టా అకౌంట్‌ వాడుతుంటానని ఈలాన్‌ ప్రకటించాడు.

గతంలో విమర్శలు
ఫేస్‌బుక్‌ వ్యవహరిస్తున్న తీరును గతంలో ఈలాన్‌ మస్క్‌ బాహాటంగా విమర్శించాడు. ఆఖరికి తన కంపెనీలైన స్పేస్‌ఎక్స్‌, టెస్లాలకు సంబంధించిన అధికారిక ట్విటర్‌ ఖాతాలను ఫేస్‌బుక్‌ నుంచి 2018లో తొలగించాడు ఈలాన్‌మస్క్‌. ఆ తర్వాత కేవలం ట్విటర్‌లోనే కొనసాగుతూ వస్తున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా ఇన్‌స్టా అకౌంట్‌ కూడా ఉందంటూ బయటి ప్రపంచానికి తెలిపారు.

ఇప్పుడెందుకిలా?
ట్విటర్‌ తరహాలో ఊహించిన చిత్రవిచిత్రమైన ఎత్తుగడలను అనుసరించిన ఈలాన్‌ మస్క్‌ ఈసారి ఇన్‌స్టా విషయంలో కొత్తగా ఏమైనా చేయబోతున్నారా ? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఫ్యూచర్‌ టెక్నాలజీని అమితంగా ఇష్టపడతారు ఈలాన్‌ మస్క్‌. మరోవైపు మెటావర్స్‌పై ఇన్‌స్టా ఓనర్లు విపరీతంగా శ్రమిస్తున్నారు. దీంతో ఈలాన్‌ మస్క్‌ ‘మెటా’ మీద దృష్టి సారించారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. 

ట్విటర్‌ విషయంలో
ఈలాన్‌ మస్క్‌ గతంలో వ్యవహరించిన తీరును గమనిస్తే.. భవిష్యత్తులో తాను తీసుకోబోయే నిర్ణయాలకు సంబంధించిన అంశాలను ముందుగానే క్లూ ఇస్తూ వస్తుంటారు.ట్విటర్‌ టేకోవర్‌ విషయంలో ఇదే పంథాను ఫాలో అయ్యారు. ట్విటర్‌ ఓపెన్‌ సోర్స్‌ కోడ్‌, ఫ్రీడమ్‌ ఆఫ్‌ స్పీట్‌ పేరుతో ట్విటర్‌లో ఓటింగ్‌ నిర్వహించి చివరకు టేకోవర్‌ నిర్ణయం ప్రకటించారు. ఆ తర్వాత ఫేక్‌ఖాతాల అంశం ప్రస్తావిస్తూ చివరకు ఈ డీల్‌ను సందిగ్ధంలో పడేశారు. 

చదవండి: అదంతా నాన్‌సెన్స్‌.. తీవ్రంగా ఖండించిన ఎలన్‌ మస్క్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement