బిలియనీర్ ముఖేష్ అంబానీ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజ సంస్థలైన ఐటీసీ, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్, అదానీ విల్ మార్‌లను తన ఇండిపెండెన్స్ బ్రాండ్‌తో ఢీకొట్టనున్నారని మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ముఖేష్ అంబానీ కొద్ది రోజుల క్రితం తన రిలయన్స్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ లిమిటెడ్ (ఆర్‌సీపీఎల్) విభాగం నుంచి రిలయన్స్ రీటైల్ వెంచర్ (ఆర్‌ఆర్‌వీఎల్)పేరుతో ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించారు.
ఇప్పటి వరకు రిలయన్స్ రీటైల్, రిలయన్స్ లైఫ్ సైన్సెస్, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్, రిలయన్స్ పెట్రోలియం, నెట్‌వర్క్ 18, ఫుట్ బాల్ స్పోర్ట్స్ డెవెలప్‌మెంట్ లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీయల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు ఇతర వ్యాపారాల్లో విజయ పథంలో దూసుకెళ్తున్నారు ముఖేష్ అంబానీ. అయితే ఈ ఏడాది ఆగస్ట్ 28న రిలయన్స్ ఇండస్ట్రీస్ 44వ కంపెనీ వార్షిక వాటాదారుల సమావేశం (ఏజేఎం)లో అంబానీ ఎఫ్‌ఎంసీజీ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటన చేశారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే ఇండిపెండెన్స్ బ్రాండ్‌ను లాంచ్ చేసి స్టేపుల్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
పైలెట్ ప్రాజెక్ట్ గుజరాత్ నుంచే
రిలయన్స్ ఇండస్ట్రీస్ మాతృసంస్థకు చెందిన ఆర్‌ఆర్‌వీఎల్ గుజరాత్‌లో ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్‌లను అమ్మడం ప్రారంభించింది. ప్రస్తుతం ముఖేష్ అంబానీ సొంత రాష్ట్రంలో ఎఫ్‌ఎంసీజీ ఉత్పత్తులు మార్కెట్‌లో లభ్యం కాగా.. దశల వారీగా దేశం మొత్తం ఎఫ్‌ఎంసీజీ మార్కెట్‌కి పరిచయం కానున్నారు.
అదానీ.. టాటా మధ్యలో అంబానీ
ఎఫ్ఎంసీజీలో విభాగంలో అదానీ సంస్థ పోటీ పడే సంస్థల్లో అదానీ విల్మర్ : వంటనూనె, ధాన్యాలు, పప్పులు
పతంజలి ఫుడ్స్ : బిస్కెట్లు, వంట నూనె, ప్యాకేజ్డ్ గోధుమ పిండి విభాగంలో
బిస్కెట్లలోనే పార్లే
బ్రిటానియాతో పప్పులు
ప్యాకేజ్డ్ వాటర్ రంగంలో టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో
ప్యాకేజ్డ్ గోధుమ పిండి, బిస్కెట్లలో ఐటీసీతో నేరుగా తలపడనుందని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నోమురా అభిప్రాయం వ్యక్తం చేసింది. ప్రస్తుతం జియో మార్ట్ యాప్, రిలయన్స్ రిటైల్ స్టోర్లలో ఇండిపెండెన్స్ లైన్ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. రాబోయే నెలల్లో, పంపిణీని ఎఫ్‌ఎంసిజి రిటైలర్లకు (కిరాణా స్టోర్స్) విస్తరించనున్నారు.
ఇండిపెండెన్స్ ప్రొడక్ట్‌లు ఇవే
రిలయన్స్ విక్రయించే ఎఫ్‌ఎంసీజీ ప్రొడక్ట్‌ల కేటగిరీలలో బిస్కెట్లు, ప్యాకేజ్డ్ వాటర్, ఎడిబుల్ ఆయిల్, ప్యాక్ చేసిన అటా (గోధుమ పిండి), బేసన్ (పప్పు పిండి), పప్పులు, ధాన్యాలు, చక్కెర ఉన్నాయి.
చదవండి👉 రూ.15వేలకే ల్యాప్‌ట్యాప్,‘రిలయన్స్ జియో సరికొత్త సంచలనం!’
Comments
Please login to add a commentAdd a comment