ఉక్రెయిన్‌పై సైనికచర్యను ప్రారంభించినప్పటీ నుంచి రష్యా అనేక ఆంక్షలను ఎదుర్కొంటుంది. ఆంక్షలతో రష్యాను అమెరికా,యూరప్‌దేశాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇక అమెరికన్ కంపెనీలు కూడా రష్యాకు షాకిస్తున్నాయి. ఆర్థికంగా రష్యాను దెబ్బ తీసేందుకుగాను వీసా, మాస్టర్‌కార్డు లాంటి సంస్థలు తమ సేవలను పూర్తిగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ఐతే అమెరికన్ టెక్ కంపెనీలు కూడా రష్యాకు కంటిమీద కునుకులేకుండా చేస్తూ నిర్ణయాలను తీసుకుంటున్నాయి.కొద్ది రోజుల క్రితమే రష్యాకు షాకిస్తూ ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రాం తమ సేవలను రష్యాలో నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కాగా అమెరికన్ కంపెనీలకు బుద్ది చెప్పే విధంగా రష్యా ముందడుగు వేస్తోంది.
ఇన్‌స్టాగ్రామ్‌కు పోటీగా..!
ఇన్‌స్టాగ్రామ్‌ను నిలిపివేయడంతో దానికి ప్రత్యామ్నాయంగా మరో ప్లాట్‌ఫాంను తెచ్చేందుకు సిద్దమైంది. ఇన్‌స్టాగ్రామ్‌కు ప్రత్యామ్నాయంగా రష్యన్ టెక్ ఎంట్రీప్యూనర్స్ డెవలప్ చేసిన ఫోటో ఫేరింగ్ యాప్లికేషన్‌ను రష్యాలో తెచ్చేందుకు సిద్దమయ్యారు. ఇన్‌స్టాగ్రామ్ స్థానంలో రోస్‌గ్రామ్ (Rossgram)ను మార్చి 28న లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ యాప్‌కు సంబంధించిన పనులు ఇప్పటికే చకచకా పూర్తవుతున్నట్లు రోస్‌గ్రామ్ వ్యవస్తాపకులు కిరిల్ ఫిలిమోనోవ్ పేర్కొన్నారు.
భారీ నష్టం..!
ఇన్‌స్టాగ్రామ్‌కు సుమారు 80 మిలియన్ల రష్యన్స్ వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ తీసుకున్న నిర్ణయం కంపెనీకి భారీ నష్టం తెచ్చిపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రష్యన్ యూజర్లు రోస్‌గ్రామ్‌కు వెళ్తే మెటాకు భారీ నష్టం కల్గనుంది. ఇక రోస్‌గ్రామ్‌ను ప్రపంచవ్యాప్తంగా లాంచ్ చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నట్లు యాప్ నిర్వహకులు తెలిపారు.ఇప్పటికే రష్యాకు చెందిన మెసేజ్ సర్వీస్ యాప్ టెలిగ్రామ్‌ను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: రష్యాకు ఇన్‌స్టాగ్రామ్ టాటా..బైబై..!
Comments
Please login to add a commentAdd a comment