ట్రోఫీ అందుకుంటున్న శ్రీకాకుళం జట్టు
నగరి : కేవీకే మైదానంలో రెండురోజులుగా నిర్వహిస్తున్న అంతర్‌జిల్లాల అండర్–14 బాల బాలికల కబడ్డీ పోటీలు మంగళవారంతో ముగిశాయి. బాలుర విభాగంలో శ్రీకాకుళం జట్టు విన్నర్‌గా, చిత్తూరు జట్టు రన్నర్‌గా నిలిచాయి. బాలిక విభాగం ఫైనల్ పోటీలో విజేతగా కర్నూల్ జట్టు నిలిచింది. ప్రకాశం జిల్లా జట్టు రెండో స్థానంతో సరిపెట్టుకుంది. ముగింపు కార్యక్రమంలో డీఈఓ విజయేంద్రరావు, ఎంఈఓ శ్రీదేవి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ భానుమూర్తిరాజు, ఎస్‌జీఎఫ్ కార్యదర్శులు సురేష్‌బాబు, బాబు, వసంతమ్మ, రమ, ఉపాధ్యాయులు భాస్కర్ రెడ్డి, తమిళ్‌మణి, రమేష్‌రెడ్డి, బాబు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment