![అర్జీల పరిష్కారానికి పకడ్బందీగా చర్యలు](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/06ctr503-300007_mr-1738873006-0.jpg.webp?itok=kwyAGFyO)
అర్జీల పరిష్కారానికి పకడ్బందీగా చర్యలు
● రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ప్రతి అర్జీని పరిష్కరించాలి ● వరుస సమీక్షల్లో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ
చిత్తూరు కలెక్టరేట్ : రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన అర్జీల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో పలు శాఖలతో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల్లో నమోదైన ప్రతి అర్జీని కచ్చితంగా పరిష్కరించాలన్నారు. అర్జీలను నిర్ణీత గడువు లోపు పరిష్కరించేలా తహసీల్దార్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలన్నారు. జిల్లా స్థాయిలో అర్జీలు పరిష్కారం అయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. క్షేత్ర స్థాయిలో పర్యటించి, అర్జీదారునికి సమాచారం ఇచ్చి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. అర్జీదారులు కార్యాలయాల చుట్టూ తిరగకుండా కార్యాలయంలో సంబంధిత అధికారులు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలన్నారు. రెవెన్యూ సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా, బాధ్యతాయుతంగా నిర్వ హించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జేసీ విద్యాధరి, డీఆర్వో మోహన్‌కుమార్, ఆర్డీఓలు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గొన్నారు.
వేసవిలో తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు
రానున్న వేసవిని దృష్టిలో పెట్టుకుని తాగునీటి ఎద్దడికి ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ తెలిపారు. ప్రతి మండలంలో ప్రస్తుతం ఉన్న నీటి వనరులను గుర్తించాలన్నారు. నీటి వనరుల స్థితిగతుల పై మార్చి 15వ తేదీ వరకు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వేలో బోర్‌వెల్స్, చేతిపంపుల నిర్వహణ పూర్తి వివరాలను పక్కాగా నమోదుచేసి నివేదికలు ఇవ్వాలన్నారు. ఈ సమీక్షలో ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయకుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment