రోడ్డెక్కిన మృతుల బంధువులు
విజయపురం : ఇద్దరి మరణానికి కారణమైన వాహనాన్ని వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని రవి, మంజుల కుటుంబ సభ్యులు గురువారం మధ్యాహ్నం రోడెక్కారు. పన్నూరు సబ్‌స్టేషన్ సమీపంలోని నాలుగు రోడ్డు కూడలిలో నిరసన పట్టారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ధర్నా చేయడంతో పన్నూరు, తిరుత్తణి రోడ్డుపై రాకపోకలు స్తంభించాయి. నిండ్ర మండలం, అగరంపేట దళితవాడకు చెందిన రవి, కేవీబీపురం మండలం, కొల్లత్తూరు దళితవాడకు చెందిన మంజుల బుధవారం రాత్రి తెల్లగుంట వద్ద గుర్తు తెలి యని వాహనం ఢీకొని అక్కడిక్కడే మృతి చెందిన విషయం విదితమే. ఈ ప్రమాదానికి కారణమైన వాహనాన్ని వెంటనే పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు ధర్నా చేశారు. న్యాయం జరి గే వరకు ఆస్పత్రి నుంచి మృతదేహాన్ని తీసు కోబోమని నిరసన కొనసాగించారు. అనంతరం నగ రి రూరల్ సీఐ భాస్కర్, విజయపురం ఎస్‌ఐ బల రాం రెండు రోజుల్లో విచారణ జరిపి వాహనాన్ని ప ట్టుకుంటామని చెప్పడంతో నిరసన విరమించారు.
ప్రమాదానికి కారణమై వాహనాన్ని పట్టుకోవాలిని డిమాండ్
పోలీసుల హామీతో ఆందోళన విరమణ
Comments
Please login to add a commentAdd a comment