![శతాధి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/7/adhar_mr-1738873006-0.jpg.webp?itok=RmSXV2sn)
శతాధిక వృద్ధుడి మృతి
చౌడేపల్లె: శతాధిక వృద్ధుడు దిగువపల్లె పంచా యతీ అప్పినేపల్లెకు చెందిన కంచం వెంకటప్ప నాయుడు(102) మృతి చెందినట్లు బోయకొండ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ శివప్పనాయుడు గురువారం తెలిపారు. ఆధార్ కార్డులో జనన తే దీ మేరకు ఆయనకు 102 ఏళ్లు నిండాయన్నారు. శుక్రవారం అప్పి నేపల్లెలో అంత్యక్రియలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఆయన మృతిపై పలు వురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు సంతాపం తెలిపారు.
రుణ దరఖాస్తుల
గడువు పొడిగింపు
చిత్తూరు కలెక్టరేట్ : బీసీ కార్పొరేషన్ రుణాల దరఖాస్తుల గడువు పొడిగిస్తున్నట్లు ఆ శాఖ ఈడీ శ్రీదేవి తెలిపారు. గురువారం ఆమె విలేక రులతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ రుణాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 12వ తేదీ వరకు గడువు పెంచారన్నారు. జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువకులు స్వయం ఉపా ధి యూనిట్ల స్థాపనకు దరఖాస్తులు చేసుకోవచ్చన్నారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 6 కంపార్ట్‌మెంట్లు నిండాయి. బుధవారం అర్ధరాత్రి వరకు 58,600 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టైంస్లాట్ టికె ట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టికెట్లు లేని భక్తులకు 8 గంటల్లో దర్శనం లభిస్తోంది.
![శతాధిక వృద్ధుడి మృతి
1](https://www.sakshi.com/gallery_images/2025/02/7/06pgr21-300048_mr-1738873006-1.jpg)
శతాధిక వృద్ధుడి మృతి
Comments
Please login to add a commentAdd a comment