13 న షబే బరాత్‌ పండుగ | - | Sakshi
Sakshi News home page

13 న షబే బరాత్‌ పండుగ

Published Fri, Feb 7 2025 2:05 AM | Last Updated on Fri, Feb 7 2025 2:05 AM

13 న

13 న షబే బరాత్‌ పండుగ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ముస్లింలు అందరూ ఈనెల 13వ తేదీన షబే బరాత్‌ పండుగ జరుపుకోవాలని జిల్లా ప్రభుత్వ ఖాజీ సయ్యద్‌ మోహమ్మద్‌ కమాలుల్లా జుహురి లతీఫ్‌ జునైది గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మర ణించిన తమ పూర్వీకుల ఆత్మ శాంతి కోసం షబే బరాత్‌ పండుగ సందర్భంగా ముస్లింలందరూ ఈ పండుగ రోజు రాత్రి ప్రత్యేక ప్రార్థనలు చేయాలని కోరారు.

బినామీ మస్టర్లకు చెక్‌

ఎన్‌ఎంఎంఎస్‌ హాజరు తప్పనిసరి చేసిన కేంద్రం

గుడిపాల: ఉపాధిహామీ పథకంలో బినామీ మ స్టర్లకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం హాజ రు నిబంధనలను కఠినతరం చేసింది. నేషనల్‌ మొబైల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంఎంఎస్‌) తప్పనిసరి చేసింది. ప్రతిరోజూ పనిచేసే చోట ఫొటో తీసి ఎన్‌ఎంఎంఎస్‌ ఆన్‌లైన్‌లో హాజరు వేయాలి. కొంతమంది ఉపాధి సిబ్బంది సెల్‌ఫోన్‌లు పనిచేయడం లేదని, సర్వర్‌ సమస్య ఉందని చెప్పి హాజరును సాధారణ పద్ధతిలో వేసేవారు. బినామీ మస్టర్లు వేసి, నిధులు స్వాహా చేసేవారు. ఇకపై ఎన్‌ఎంఎంఎస్‌ హాజ రు వేసిన వారికి మాత్రమే వేతనాలు చెల్లిస్తా రు. జిల్లాలో 31 మండలాలకు సంబంధించి 700 పంచాయతీల్లో 2.68 లక్షల జాబ్‌కార్డులున్నాయి. 4.80లక్షల మంది వేతనదారులు ఉన్నారు. వీరిలో రోజుకు సుమారు 2.10 లక్షల మంది వరకు ఉపాధిహామీ పనులకు హాజరవుతున్నారు. వీరందరికీ ఇకపై ఎన్‌ఎంఎంఎస్‌లోనే హాజరు వేయాలని, సాధారణ పద్ధతిలో వేస్తే పరిగణనలోకి తీసుకోమని డ్వామా అధికారులు తెలిపారు.

బైరెడ్డిపల్లెలో జెడ్పీ సీఈఓ తనిఖీలు

బైరెడ్డిపల్లె: జెడ్పీ సీఈఓ రవికుమార్‌నాయుడు గురువారం బైరెడ్డిపల్లె మండలంలోని ప్రభుత్వ కార్యాలయాలను ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంలో రికార్డులను పరిశీలించి, తాగునీటి సమస్యపై ఆరా తీశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. అనంతరం బైరెడ్డిపల్లె ఎస్సీ వసతి గృహాన్ని సందర్శించి, సమస్యలను అడిగితెలుసుకున్నారు. జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యత లోపిస్తే చర్యలు తప్పవని నిర్వాహకులను హెచ్చరించారు. ఎంపీడీఓ రాజేంద్రబాలాజీ, పీఆర్‌ఏఈ విద్యాసాగర్‌ పాల్గొన్నారు.

ద్రవిడ వర్సిటీలో 8 మంది ఉద్యోగుల తొలగింపు

కుప్పం: ద్రావిడ విశ్వవిద్యాలయంలో 8 మంది తాత్కాలిక ఉద్యోగులను తొలగించారు. వర్సిటీలో తాత్కాలిక పద్ధతిలో విధులు నిర్వహిస్తూ దీర్ఘకాలిక సెలవు పెట్టి విధులు హాజరుకాకపోవడం, రెగ్యులర్‌గా విధులకు హాజరుకాకుండా నామమాత్రంగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను గురువారం తొలగించారు. ఇది వరకే దీర్ఘకాలిక సెలవుపై వెళ్లిన ఉద్యోగులు విధులకు హాజరు కావాలని రిజిస్ట్రార్‌ ఆచార్య కిరణ్‌ కుమార్‌ సర్క్యులర్‌ను జారీ చేశారు. అలా విధులకు హాజరుకాని ఉద్యోగులను తొ లగిస్తామని హెచ్చరించగా.. పలువురు ఉద్యో గులు విధుల్లోకి చేరారు. అయితే విధులకు హాజరు కాని ఉద్యోగులను శాశ్వతంగా తొలగించారు.

డీఎడ్‌ పరీక్ష ఫీజు చెల్లించండి

చిత్తూరు కలెక్టరేట్‌ : డీఎడ్‌ మొదటి, మూడో సెమిస్టర్‌, వన్స్‌ ఫెయిల్డ్‌ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించాలని డీఈఓ వరలక్ష్మి సూచించారు. గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. రూ.50 అపరాధరుసుంతో ఈ నెల 14 వ తేదీ వరకు అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉందన్నారు. అభ్యర్థులు చెల్లించిన ఫీజును ప్రిన్సిపాళ్లు ఈ నెల 15వ తేదీన చెల్లించాలన్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అప్‌డేట్‌ చేసేందుకు అవకాశం కల్పించారని ఆమె తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
13 న షబే బరాత్‌ పండుగ 
1
1/2

13 న షబే బరాత్‌ పండుగ

13 న షబే బరాత్‌ పండుగ 
2
2/2

13 న షబే బరాత్‌ పండుగ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement