![- - Sakshi](/styles/webp/s3/article_images/2023/04/22/5668.jpg.webp?itok=1M_huy16)
చౌడేపల్లె: మహిళకు చెందిన నగ్న ఫొటోలు, వీడియో ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసిన యువకుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ మధుసూధనరెడ్డి తెలిపారు. శుక్రవారం సాయత్రం సీఐ ఆ వివరాలు మీడియాతో తెలిపారు. మండలంలోని గడ్డంవారిపల్లె పంచాయతీ తెల్లనీళ్లపల్లెకు చెందిన 30 ఏళ్ల మహిళకు రామసముద్రం మండలం అరికెల పంచాయతీ గోసువారిపల్లెకు చెందిన ఎం.అంజనీకుమార్ రెడ్డి ఫేస్‌బుక్‌లో పరిచమయ్యాడు. కొద్దిరోజుల తరువాత ఆమెకు చెందిన నగ్న ఫొటోలు, వీడియోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడంతో ఆ మహిళ చౌడేపల్లె ఎస్‌ఐ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అతన్ని అరెస్ట్‌చేసి పుంగనూరు కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండుకు ఆదేశించారని సీఐ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment