![అసంఘటిత కార్మికులకు సంక్షేమం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12ctr503-300007_mr-1739415051-0.jpg.webp?itok=iorAhZja)
అసంఘటిత కార్మికులకు సంక్షేమం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని అసంఘటిత కార్మికులకు సంక్షేమ పథకాలు అందించేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ గాంధీ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అసంఘటిత కార్మికుల వివరాలను ఈ–శ్రమ్ పోర్టల్ లో ఉచితంగా నమోదు చేయాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతంగా చేపట్టాలని ఆదేశించారు. అసంఘటిత, వలస కార్మికులు, వారి కుటుంబ సభ్యులకు సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్‌లో వివరాలు సేకరిస్తోందన్నారు. ఉచిత నమోదు, గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలన్నారు. 16 నుంచి 59 సంవత్సరాల వయసు లోపు, ఆదాయ పన్ను చెల్లించని, ఈపీఎఫ్, ఈఎస్‌ఐ సదుపాయం లేని వారు ఈ–శ్రమ్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలలో పనిచేసే సన్న, చిన్నకారు రైతులు వ్యవసాయ కూలీలు, చేనేత కార్మికులు, ఉపాధి కూలీలు ఇలా వివిధ రంగాలలో అసంఘటిత కార్మికులు ఈ శ్రమ్ ను సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. మండల, గ్రామ స్థాయిలోని అధికారులతో సమన్వయం చేసుకుని నమోదు ప్రక్రియను వేగవంతం చేయలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ రవికుమార్ నాయుడు, కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ ఓంకార్, డ్వామా పీడీ రవికుమార్, బిసి కార్పొరేషన్ ఏడీ శ్రీదేవి, ఐసీడీఎస్ పీడీ వెంకటేశ్వరి, జిల్లా వ్యవసాయ అధికారి మురళికృష్ణ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి చెన్నయ్య పాల్గొన్నారు.
ఈశ్రమ్ పోర్టల్‌లో నమోదుకు అవకాశం
సమావేశంలో కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వెల్లడి
Comments
Please login to add a commentAdd a comment