![ఇరువర్గాల క్షేమానికే లోక్ అదాలత్](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/12pgr02-300046_mr-1739415051-0.jpg.webp?itok=u0FbMGLK)
ఇరువర్గాల క్షేమానికే లోక్ అదాలత్
● మార్చి 8న అదాలత్ ● లీగల్ సర్వీసస్ అఽథారిటీ చైర్మన్ భారతి
పుంగనూరు : సమాజంలోని రెండు వర్గాల విభేదాలను పక్కన పెట్టి క్షేమంగా ఇరువురు కలిసి ఉండేందుకు లోక్ అదాలత్‌ను వేదికగా మార్చుకోవాలని జిల్లా లీగల్ సర్వీసస్ అథారిటీ చైర్మన్ , సీనియర్ సివిల్ జడ్జి భారతి పేర్కొన్నారు. బుధవారం కోర్టు ఆవరణంలో స్థానిక సీనియర్ సివిల్ జడ్జి ఆరీఫాషేక్, అడిషినల్ జూనియర్ సివిల్ జడ్జి కృష్ణవంశీతో కలసి న్యాయవాదులు, పోలీసులు, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ భారతి మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా పెండింగ్ కేసులను తగ్గించేందుకు న్యాయవాదులు, వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి , అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. కేసుల పరిష్కారంలో ప్రతి ఒక్కరు ఒక అడుగు తగ్గి మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. పట్టింపులకు వెళ్తే సమస్యలు తీవ్రమై కాలయాపనతో పాటు అధిక వ్యయం అవుతుందన్నారు. వీటికి చెక్ పెట్టేందుకు రాష్ట్ర లీగల్ సర్వీసస్ అథారిటీ లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేసి, అన్ని రకాల కేసుల పరిష్కార వేదికగా ఏర్పాటు చేసిందన్నారు. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ మధ్యవర్తిత్వం ద్వారా కేసులను పరిష్కరించుకునేందుకు ముందుకు రావాలన్నారు. లోక్ అదాలత్‌లో పరిష్కారమయ్యే కేసులపై అప్పీల్ ఉండదని, ఇందుకు సంబంధించిన కేసులకు కోర్టు ఫీజు వెనక్కి ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ మార్చి 8న జరిగే లోక్ అదాలత్‌లో అధిక కేసులు పరిష్కరించేందుకు కృషి చేసి, విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో న్యాయవాదుల సంఘ అధ్యక్షుడు ఆకుల చెన్నకేశవులు, సీఐ శ్రీనివాసులు, న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment