మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా | - | Sakshi
Sakshi News home page

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా

Published Thu, Feb 13 2025 8:54 AM | Last Updated on Thu, Feb 13 2025 8:54 AM

మొగిల

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా

బంగారుపాళెం మండలంలోని మొగిలి ఘాట్‌లో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కంటైనర్‌ బోల్తా పడింది.

ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు

ఆడ పిల్లలను ఏటి గట్టుకు తీసుకుపోలేని పరిస్థితి నెలకొంది. గట్టుపై మద్యం తాగుతూ వచ్చిపోయే వారిని దుర్భాషలాడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు. వారి కంటబడకుండా తెల్లవారుజామున 3 గంటలకో, 4 గంటలకో వెళ్లివస్తామనుకుంటే అక్కడే మకాం వేస్తున్నారు. చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతం అవుతున్నాం.

– సరస్వతీ, వినాయకపురం

కాలు విరగడంతో ఆస్పత్రి చేర్పించాం

నీటిలో ఇసుక తీసేస్తుండడంతో నీటిలో నడుస్తూ గట్టుకు వచ్చేవారికి గుంతలు కనిపించక అకస్మాత్తుగా లోపలికి దిగపడిపోతున్నారు. ఒక మహిళకు ఈ కారణంగా కాలు విరిగితే ఆస్పత్రిలో చేర్పించాం. ఈ విషయమై ప్రశ్నిస్తే కొట్టడానికి వస్తున్నారు. ఇసుక తరలింపు ఆపితేనే మాకు ప్రశాంతత.

– కుప్పమ్మ, వినాయకపురం.

ప్రశ్నిస్తే బెదిరింపులు

వయసులో ఉన్న ఆడ పిల్లలు నది గట్టుకు వెళ్లలేని పరిస్థితి. ఇసుక తరలింపుదారులు గోడలపై నిలబడి వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే నీ పని చూసుకొని వెళ్లు లేకుంటే ట్రాక్టర్‌ పైకి ఎక్కించేస్తాం, కాలు విరిచేస్తాం అంటూ బెదిరిస్తున్నారు. వీధుల్లో వేగంగా ట్రాక్టర్లు వెళుతున్నాయి. పిల్లల్ని వీధిలోకి పంపాలంటేనే భయమేస్తోంది.

– కన్నెమ్మ, వినాయకపురం.

ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు

ఇక్కడ మహిళలకు కాలకృత్యాలకు ఏటి గట్టుకు వెళ్లడం అలవాటు. అయితే ప్రస్తుతం రాత్రింబవళ్లు ఇసుక ట్రాక్టర్లతో నది హడావుడిగా ఉంటోంది. మరుగుగా వెళ్లే ఆడ పిల్లలను కొందరు ఫొటోలు, వీడియోలు తీస్తున్నారు. పలువురికి ఈ పరిస్థితి ఎదురవడంతో గ్రామమంతా రోడ్డుపైకి వచ్చేసింది. ఏటి గట్లంతా మందు బాటిళ్లే ఉన్నాయి.

–శ్రీనివాసన్‌, సత్రవాడ

– 8లో

No comments yet. Be the first to comment!
Add a comment
మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా 
1
1/3

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా 
2
2/3

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా 
3
3/3

మొగిలి ఘాట్‌లో కంటైనర్‌ బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement