కమిటీ సమావేశంలో పాల్గొన్న అధికారులు
● జనవరి 6వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలి ● కమిటీ సమావేశంలో కలెక్టర్ షణ్మోహన్ వెల్లడి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అర్హులైన జర్నలిస్టులందరికీ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ఇళ్ల పట్టాలను మంజూరు చేస్తామని కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో జర్నలిస్టుల ఇళ్ల పట్టాల మంజూరుకు ఏర్పాటు చేసిన కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ వర్చువల్ విధానంలో హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల పట్టాల మంజూరు కోసం జనవరి 6వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో తప్పనిసరిగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. జిల్లాలోని వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తూ 2023 సంవత్సరంలో అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు ఇళ్ల పట్టాల మంజూరుకు ప్రభుత్వం జీఓ 535 ను జారీచేసిందన్నారు. ఇళ్ల పట్టాల దరఖాస్తులను రాష్ట్ర పౌరసంబంధాల శాఖ కార్యాలయం అధికారులు ప్రాథమికంగా పరిశీలన చేశారన్నారు. ఆ పరిశీలనలో అక్రిడిటేషన్ కార్డు, కనీసం 5 సంవత్సరాలు జర్నలిస్టుగా పనిచేసిన అనుభవాన్ని పరిశీలించారని తెలిపారు. పరిశీలన చేసిన తర్వాత ఇప్పటి వరకు 195 మంది జర్నలిస్టుల ప్రాథమిక జాబితా జిల్లాకు పంపారని చెప్పారు. తదుపరి పరిశీలనను త్వరతిగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. జిల్లాలో ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను గుర్తించే ప్రక్రియను ప్రారంభించినట్లు తెలిపారు. జనవరి 6 వ తేదీతో దరఖాస్తులు చేసుకునేందుకు గడువు ముగుస్తుందని ఎవరైనా దరఖాస్తులు చేసుకోకపోతే త్వరతిగతిన చేసుకోవాలన్నారు. అనంతరం ఇళ్ల స్థలాల గుర్తింపునకు సంబంధించిన పలు అంశాలను చిత్తూరు ప్రెస్‌క్లబ్ కార్యదర్శి అశోక్‌కుమార్ అధికారుల తో చర్చించారు. ఈ కమిటీ సమావేశంలో డీఆర్వో రాజశేఖర్, ఆర్డీఓ చిన్నయ్య, జిల్లా సర్వే శాఖ ఏడీ గౌస్‌బాషా, డీఐపీఆర్వో పద్మజ, తహసీల్దార్లు మురళీమోహన్, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment