కోచింగ్ ఖర్చు పెరుగుతోంది
మాది వ్యవసాయ కుటుంబం. చాలా రోజుల నుంచి డీఎస్సీ కోసం తిరుపతి హాస్టల్‌లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నా. ప్రభుత్వమేమో డీఎస్సీ నోటిఫికేషన్ విఽడుదల చేస్తామని వాయిదాలు వేసు కుంటూ పోతోంది. మాకేమో కోచింగ్ ఖర్చుభారీగా అవుతోంది. డీఎస్సీ ఎప్పుడు పెడతారో ఏమో?
– లిష, వేపగుంట, పుత్తూరు మండలం
ఫీజు కట్టలేక అవస్థలు పడుతున్నా
మాది రైతు కుటుంబం. నేను అవనిగడ్డలో డీఎస్సీ కోచింగ్ తీసుకుంటున్నా. అయితే ఈ ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణకు వాయిదాలు వేస్తోంది. కోచింగ్, హాస్టల్ ఫీజులు చెల్లించుకోలేక ఇబ్బందులు పడుతున్నా. త్వరగా నోటిఫీకేషన్ విడుదల చేసి పరీక్షలు నిర్వహిస్తే అందరికీ మంచిది.
– ఎ.స్వాతి, పాదిరికుప్పం, కార్వేటినగరం
ఇంటికి వచ్చేశాను
ఉపాధ్యాయ ఉద్యోగం చేయాలనే ఆశతో డీఎడ్ చేశాను. తిరుపతిలో కోచింగ్ తీసుకున్నాను. ప్రభు త్వం డీఎస్సీ నిర్వహణలో వాయిదాల పర్వం కొనసాగిస్తుండడంతో ఫీజులు చెల్లించలేక ఇంటికి వచ్చేశాను. నాలాంటి వారు వేలాంది మంది డీఎస్పీ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.
– సాయికుమార్, డీఎస్సీ అభ్యర్థి, కార్వేటినగరం
Comments
Please login to add a commentAdd a comment